కరోనాపై బ్రహ్మాస్త్రాలు.. భారత్‌లో అందుబాటులోకి మరో రెండు టీకాలు
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్క దేశాన్ని ఆక్రమిస్తూ ఈ మహమ్మారి వేగంగా దూసుకెళ్తోంది. దీని ధాటికి బ్రిటన్, అమెరికా, దక్షిణాఫ్రికాలు వణుకుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రపంచదేశాలు ఆంక్షల బాట పడుతున్నాయి. అయితే ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రస్తుత పరిస్ధితుల్లో వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ వంటివి మాత్రమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వాలు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మనదేశంలోనూ జనవరి 10 నుంచి హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి బూస్టర్ డోస్ ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అలాగే 15-18 సంవత్సరాలు వయసు పిల్లలకు టీకాలు వేస్తామని ప్రధాని వెల్లడించారు.
ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో భారత్ మరో రెండు టీకాలకు అనుమతి మంజూరు చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె) తయారుచేసిన ‘కొవొవాక్స్’కు, బయోలాజికల్-ఈ తయారు చేసిన కార్బెవాక్స్‌కు అనుమతులు మంజూరు చేయాలని... కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు కేంద్రం వాటి వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా ప్రకటించారు.
అలాగే ‘మోల్నుపిరవిర్’ ఔషధానికి కూడా అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించింది. మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్ సంయుక్తంగా ఈ యాంటీ-వైరల్ ఔషధాన్ని అభివృద్ధి చేశాయి. భారత్‌లో ఈ డ్రగ్‌ని 13 సంస్థలు తయారు చేస్తాయని మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. కొవిడ్‌తో బాధపడుతున్న పెద్దలు, వ్యాధి మరింత ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి దీనిని ఇవ్వొచ్చని మన్‌సుఖ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com