సుజనాకు షాకిచ్చిన సీబీఐ.. హార్డ్ డిస్క్‌లు స్వాధీనం
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరికి సీబీఐ అధికారులు సడన్ షాకిచ్చారు. శనివారం నాడు నివాసంతో పాటు, ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదా చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన సీబీఐ అధికారులు పలు బృందాలుగా విడిపోయి.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్లోని సుజనా చౌదరి కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.
కాగా.. శనివారం ఉదయమే సీబీఐ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ ఎక్కడా సమాచారం పొక్కలేదు.. సాయంత్రం ఈ విషయం బయటికి రావడం గమనార్హం. నగరంలో మొత్తం మూడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా.. పలు హార్డ్ డిస్క్‌లను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు.. నలుగురు సుజనా గ్రూప్ డైరెక్టర్లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. శ్రీనివాస కళ్యాణ్‌రావు, వెంకట రమణారెడ్డి, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ వర్మను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు.
కర్నాటకలో సుజనా, సీబీఐ డైరెక్టర్ విజయరామారావ్ కుమారుడు ఇద్దరూ కలిసి ‘బెస్ట్ అండ్ కాంఫ్టన్’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అచితూ కంపెనీ పేరుతో అక్రమంగా రుణాలు తీసుకోగా.. గతంలోనే ఈడీతో పాటు సీబీఐ కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే సోదాల్లో ఏమేం దొరికాయి..? ఇంకా ఎంతసేపు సోదాలు జరుగొచ్చు..? అనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ సోదాల గురించి సుజనా చౌదరిగానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ.. సీబీఐ అధికారులు మాట్లాడలేదు. సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు మీడియాకు వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout