YS Viveka : వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. విచారణకు రావాల్సిందిగా ఆదేశం
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో సోమవారం అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటిలో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అవినాష్‌ను విచారించేందుకు నోటీసులు ఇచ్చారు. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి ఎప్పుడూ వివేకాకు వ్యతిరేకంగానే వుండేవారని, వైఎస్సార్ సోదరుడు ప్రతాప్ రెడ్డి రెండేళ్ల క్రితం సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అటు తన తండ్రి హత్య కేసులో అవినాష్ హస్తం వుందని ఆయన కుమార్తె సునీత సైతం బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
2019 ఎన్నికలకు ముందు వివేకా దారుణహత్య:
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పులివెందులలోని తన స్వగృహంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. మొదట్లో ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలు వచ్చినా తర్వాత హత్యగా తేలింది. దీనిపై తొలుత ఏపీ పోలీసులు విచారణ జరపగా.. తర్వాత సీబీఐ చేతికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కేసు విచారణ సరిగా సాగదని, సాక్షులన్ని ప్రభావితం చేసే అవకాశం వుందంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం .. వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసింది.
అవినాష్ రెడ్డికి నోటీసులివ్వడంతో కలకలం:
ఇకపోతే..ఈ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో కేసు అనూహ్య మలుపు తిరిగింది. అటు సీబీఐ సైతం దర్యాప్తు వేగవంతం చేయడం, ఇప్పుడు అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ చేసిన పిటిషన్‌లో మెరిట్‌తో పరిశీలించాలని తెలంగాణ హైకోర్టును ధర్మాసనం కోరింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout