డీఎల్ఎఫ్ ముడుపుల కేసులో లాలూకు సీబీఐ క్లీన్‌చిట్ ?

  • IndiaGlitz, [Saturday,May 22 2021]

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్లీన్‌చిట్ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దాణా కుంభకోణం కేసుల్లో శిక్ష పడటంతో ఆయన మూడేళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపి, ఏప్రిల్‌లో లాలూ బెయిలుపై విడుదలయ్యారు. గ‌తంలో జార్ఖండ్ రాష్ట్రం బీహార్‌లో ఉండేది. ఆ స‌మ‌యంలో సీఎంగా ఉన్న లాలూ ప్ర‌సాద్‌ యాద‌వ్‌.. అక్ర‌మ రీతిలో ప్రభుత్వ ఖ‌జానా నుంచి 3.13 కోట్లు కాజేశారు. ప్ర‌స్తుతం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌.. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య‌శాల‌లో చికిత్స పొందుతున్నారు. దాణా కుంభ‌కోణంలో భాగ‌మైన నాలుగు కేసుల్లో.. మూడింటిలో ఆయ‌న‌కు బెయిల్ గ‌తంలోనే మంజూరు అయ్యింది.

ఇక 2018 జనవరిలో లాలూ ప్రసాద్ యాదవ్, రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ గ్రూప్‌లపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపింది. సీబీఐలోని ఆర్థిక నేరాల విభాగం ఈ దర్యాప్తు నిర్వహించింది. ముంబైలోని బాంద్రాలో రైల్వే భూమి లీజును, న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ అప్‌గ్రెడేషన్ ప్రాజెక్టును పొందడం కోసం డీఎల్ఎఫ్ లాలూ యాదవ్‌కు దక్షిణ ఢిల్లీలో కొంత స్థిరాస్తిని లంచంగా ఇచ్చిందని, అప్పట్లో ఆయన రైల్వే మంత్రిగా ఉండేవారని సీబీఐ ఆరోపించింది. ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బూటకపు కంపెనీ పేరు మీద దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో సుమారు రూ.5 కోట్లు విలువ చేసే ఆస్తిని 2007 డిసెంబరులో కొనుగోలు చేసినట్లు ఆరోపించింది.

ఇదీ చదవండి: నేటి నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్

అనేక బూటకపు కంపెనీల ద్వారా డీఎల్ఎఫ్ హోం డెవలపర్స్ ఈ ఆస్తికి నిధులను సమకూర్చినట్లు ఆరోపించింది. అయితే అప్పట్లో ఈ ఆస్తి విలువ రూ.30 కోట్లు అని తెలిపింది. కాగా.. ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కేవలం రూ.4 లక్షలకే 2011లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్, కుమార్తెలు చంద, రాగిణిలు కొనుగోలు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే..

జాతీయ మీడియా కథనాల ప్రకారం, రెండేళ్ళపాటు జరిగిన దర్యాప్తులో ఆరోపణలకు మద్దతుగా తగిన ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. దీంతో ప్రాథమిక దర్యాప్తును సీబీఐ అధికారులు ముగించారు.

More News

ముంచుకొస్తున్న ‘యాస్’ తుపాను.. భారత నావికాదళం అప్రమత్తం

ఒకవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు తుపానులు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమతీరాన్ని వణికించిన ‘తౌక్టే’ తుపాను కాస్త బలహీన పడిందని ఆనందిస్తున్న తరుణంలో విశాఖ

ఆనందయ్య మందుపై ఆయుష్ పాజిటివ్ రిపోర్ట్..

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

RRR: ట్రేడ్ దద్దరిల్లే రికార్డ్.. రూ. 325 కోట్లంటే మాటలా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వస్తున్న

బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువట..

ప్రస్తుతం కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కూడా దేశాన్ని వణికిస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ప్రస్తుతం ఈ బ్లాక్‌ఫంగస్ సోకుతోంది. దీని కారణంగా రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు,

ఎయిర్ ఇండియాపై సైబర్ దాడి..

ఎయిర్ ఇండియాతో స‌హా ప‌లు అంత‌ర్జాతీయ విమానయాన సంస్థ‌ల‌పై భారీ సైబ‌ర్ దాడి జ‌రిగింది. ప్రయాణికుల సేవల వ్యవస్థను అందిస్తున్న ‘ఎస్‌ఐటీఏ’పై ఫిబ్రవరిలో సైబర్‌ దాడులు జరగాయి.