ప్రముఖ చాక్లెట్‌ సంస్థ క్యాడ్‌బరీ ఇండియాకు సీబీఐ ఊహించని షాక్‌

  • IndiaGlitz, [Thursday,March 18 2021]

ప్రముఖ చాక్లెట్‌ సంస్థ క్యాడ్‌బరీ ఇండియాకు సీబీఐ ఊహించని షాక్‌ ఇచ్చింది. తాజాగా క్యాడ్‌బరీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. మోండలెజ్ ఫుడ్స్ ఫ్రైవేట్ లిమిటెడ్‌గా పిలవబడుతున్న ఈ సంస్థకు చెందిన 12 మందిపై కేసు నమోదైంది. ఇద్దరు సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు నిర్మల్ సింగ్, జస్‌ ప్రీత్‌ కౌర్‌ సహా అప్పటి క్యాడ్‌బరీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ అండ్ కంప్లైయన్స్) విక్రమ్ అరోరా, దాని డైరెక్టర్లు జైల్‌బాయ్ ఫిలిప్స్, రాజేష్ గార్గ్ సహా మొత్తం 12 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. అవినీతి, మోసం ఆరోపణలతో సీబీఐ ఈ కేసును నమోదు చేసింది. సంస్థకు చెందిన హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం 10 ప్రదేశాలలో బుధవారం సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

క్యాడ్‌బరీ ఇండియా సంస్థపై సీబీఐ జరిపిన దర్యాప్తులో రికార్డులను తారుమారు చేయడం, వాస్తవాలను తప్పుగా చూపించడం వంటి విషయాలు వెలుగు చూశాయి. పన్ను ప్రయోజనాలను పొందేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా క్యాడ్‌బరీ సంస్థ ఈ మోసాలకు పాల్పడినట్టుగా వెల్లడైంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డిలో ప్రాంత ఆధారిత పన్ను ప్రయోజనాలను పొందేందుకు వాస్తవాలను తప్పుగా చూపి అవినీతికి పాల్పడిందని ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. 2009-11 మధ్య క్యాడ్‌బరీ కేంద్ర ఎక్సైజ్ అధికారులతో కుట్ర పన్నిందని సీబీఐ వెల్లడించింది. 5 స్టార్, జెమ్స్ చాక్లెట్‌ను తయారు చేస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లో తన కొత్త యూనిట్ కోసం 241 కోట్ల రూపాయల పన్ను ప్రయోజనాలను పొందారని సీబీఐ ప్రధానంగా ఆరోపిస్తోంది. నిజానికి ఆదాయపు పన్ను మినహాయింపు పొందే అర్హత లేదని తెలిసినా కూడా సంస్థ మోసానికి పాల్పడిందని సీబీఐ వెల్లడించింది.

ఈ పన్ను మినహాయింపుల కోసం ఎగ్జిక్యూటివ్ బోర్డులోని కొందరు సభ్యులు, ముఖ్య నిర్వాహకులతో కలిసి కుట్ర పన్నిందని సీబీఐ పేర్కొంది. రికార్డులను మార్చాలని, మధ్యవర్తుల ద్వారా లంచాలు ఇవ్వడంతోపాటు ఆధారాలను కప్పిపుచ్చారనేది తమ అంతర్గత దర్యాప్తులో బయటపడిందని తెలిపింది. ఈ పన్ను ప్రయోజనాలను పొందేందుకు గాను.. అధికారులకు లంచాలు, తప్పుడు సమాచారం అందించిందని సీబీఐ వెల్లడించింది. ఆదాయ పన్ను మినహాయింపు పొందే అర్హత లేదని తెలిసినా మోసానికి పాల్పడిందని సీబీఐ ఆరోపిస్తోంది. దీనిపై మోండెలెజ్ ఇండియా ప్రతినిధి తాజాగా స్పందించారు. సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి తమకు ఇంకా ఎటువంటి అధికారిక సమాచారమూ అందలేదని వెల్లడించారు. మొత్తానికి ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

More News

'రంగ్ దే'లో ప్ర‌తి పాటా నాకో ఛాలెంజే: గేయ‌ ర‌చ‌యిత శ్రీ‌మ‌ణి

స్వ‌ల్ప కాలంలోనే తెలుగు చిత్ర‌సీమ‌పై త‌న‌దైన ముద్ర వేసిన గేయ‌ర‌చ‌యిత శ్రీ‌మ‌ణి. ఆయ‌న ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌దేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భం ఇది.

జొమాటో వివాదం.. ఎంత ఫన్నీగా మారిపోయిందంటే..

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో వివాదం గత కొద్ది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. జొమాటో బాయ్‌ తనపై దాడి చేశాడంటూ బెంగళూరు యువతి రక్తమోడుతున్న

క్రేజ్‌తో ఫ్యాన్స్ రేట్ ద‌క్కించుకున్న‌ 'రంగ్ దే'

నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 26న విడుద‌ల‌వుతుంది. నితిన్‌, కీర్తి జంట‌తో పాటు వెంకీ తెర‌కెక్కించిన

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే...

2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు

వరుణ్ ఆ అమ్మాయినే చేసుకుంటానంటే ఏం చేస్తారు?: నాగబాబుతో నెటిజన్

లాక్‌డౌన్ సమయం ఎవరికి ఎలా ఉన్నా కూడా యంగ్ హీరోలకు మాత్రం బాగా కలిసొచ్చింది. చాలా వరకూ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. ఇక ఇండస్ట్రీలో మిగిలిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్