నా పేరుతో నకిలీ ఆడియోను వైరల్ చేస్తున్నారు: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
Send us your feedback to audioarticles@vaarta.com
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరుతో ఓ ఆడియో వైరల్ అవుతోంది. సదరు ఆడియోలో లాక్‌డౌన్ రెండు నెలల పాటు ఉండబోతోందని.. కాబట్టి రెండు నెలలకు సరిపడా సామానులు, మెడిసిన్స్, రేషన్, అవసరమైన డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలని సూచిస్తున్నట్టుగా ఉంది. బ్యాంకులు ఏమీ రెండు నెలల పాటు ఉండవని.. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఈ మెసేజ్ తనకు డబ్ల్యూహెచ్‌వో ద్వారా వచ్చినట్టుగా లక్ష్మీనారాయణ పేరుతో అది వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ పేరు వినగానే నెటిజన్లు దీనిని బాగా వైరల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా లక్ష్మీ నారాయణ స్పందించారు.
కొంతమంది సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ ఆడియోను వైరల్ చేశారని, దాన్ని నమ్మవద్దని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులపై తాను మాట్లాడినట్లు వైరల్ అవుతున్న ఆడియో టేపులు నకిలీవని ఆయన తేల్చి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్న తన స్నేహితుడు ఇచ్చిన సమాచారాన్ని చెబుతున్నాంటూ తన పేరుతో కొందరు నకిలీ ఆడియో సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలిసిందన్నారు. దీనిపై గతంలో సీబీఐ విభాగంలో ఫిర్యాదు చేశానన్నారు. తన పేరుతో వైరల్ అవుతున్న నకిలీ వార్తలను నమ్మవద్దని, అదే విధంగా షేర్ చేయవద్దని లక్ష్మీనారాయణ కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com