రచ్చ స్టార్ట్ చేసిన శ్రీదేవి అభిమానులు
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియా ఇప్పుడు భావ ప్రకటనకు కీలక వేదికగా మారింది. కొన్నిసార్లు మితిమీరిన అభిమానులు గొడవలకు సోషల్ మీడియా దారి ఇస్తున్నప్పటికీ సినీ సెలబ్రిటీలు, అభిమానులు తమ అభిప్రాయాలను చెప్పడానికి ఇప్పుడు సోషల్ మీడియా ఇస్తున్నంత స్పేస్ ఇస్తుంది. ఇప్పుడు అలాంటి పరిణామం ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయమేంటి? అని చూస్తే.. ‘సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి’ అనే అంశం. 2018 దుబాయ్‌లోని ఓ హోటల్‌లో శ్రీదేవి ప్రమాదవశాతు తన రూమ్‌లోని బాత్ టబ్‌లోపడి మునిగి చనిపోయారు.
శ్రీదేవి మరణం ముందు గుండెపోటుతోనే సంభవించిందని వార్తలు వచ్చాయి. తర్వాత ఆమె బాత్‌టబ్‌లో స్పృహ లేకుండా పడిపోయే సమయంలో తలకు గాయమై చనిపోయారంటూ వార్తలు వినిపించాయి. ఇలాంటి వార్తలు వచ్చిన క్రమంలో ఆమె మరణంపై చాలా అనుమానాలు నెలకొన్నాయి. మరి రెండున్నరేళ్ల తర్వాత ‘సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి’ అనే పాయింట్ ట్రెండ్ కావడానికి ప్రధాన కారణం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య. కొన్ని రోజుల ముందు ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై పెద్ద దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం సదరు కేసుని సీబీఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి అభిమానులు.. తమ అభిమాన నటి శ్రీదేవి మరణంలో అనుమానాలున్నాయని ‘సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఆగస్ట్ 13న శ్రీదేవి జయంతి సందర్భంగా ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మరి సోషల్ మీడియాలో శ్రీదేవి అభిమానుల రచ్చ ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com