ర‌చ్చ స్టార్ట్ చేసిన శ్రీదేవి అభిమానులు

  • IndiaGlitz, [Wednesday,August 12 2020]

సోష‌ల్ మీడియా ఇప్పుడు భావ ప్ర‌క‌ట‌న‌కు కీల‌క వేదిక‌గా మారింది. కొన్నిసార్లు మితిమీరిన అభిమానులు గొడ‌వ‌ల‌కు సోష‌ల్ మీడియా దారి ఇస్తున్న‌ప్ప‌టికీ సినీ సెల‌బ్రిటీలు, అభిమానులు త‌మ అభిప్రాయాల‌ను చెప్ప‌డానికి ఇప్పుడు సోష‌ల్ మీడియా ఇస్తున్నంత స్పేస్ ఇస్తుంది. ఇప్పుడు అలాంటి ప‌రిణామం ఒక‌టి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంత‌కూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విష‌య‌మేంటి? అని చూస్తే.. ‘సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి’ అనే అంశం. 2018 దుబాయ్‌లోని ఓ హోట‌ల్‌లో శ్రీదేవి ప్ర‌మాద‌వ‌శాతు త‌న రూమ్‌లోని బాత్ ట‌బ్‌లోప‌డి మునిగి చనిపోయారు.

శ్రీదేవి మ‌ర‌ణం ముందు గుండెపోటుతోనే సంభ‌వించిందని వార్త‌లు వ‌చ్చాయి. త‌ర్వాత ఆమె బాత్‌ట‌బ్‌లో స్పృహ లేకుండా ప‌డిపోయే స‌మ‌యంలో త‌ల‌కు గాయ‌మై చ‌నిపోయారంటూ వార్త‌లు వినిపించాయి. ఇలాంటి వార్త‌లు వ‌చ్చిన క్ర‌మంలో ఆమె మ‌ర‌ణంపై చాలా అనుమానాలు నెల‌కొన్నాయి. మ‌రి రెండున్న‌రేళ్ల త‌ర్వాత ‘సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి’ అనే పాయింట్ ట్రెండ్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌. కొన్ని రోజుల ముందు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంపై పెద్ద దుమారం రేగ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం స‌ద‌రు కేసుని సీబీఐకి అప్ప‌గించింది. ఈ నేప‌థ్యంలో శ్రీదేవి అభిమానులు.. త‌మ అభిమాన న‌టి శ్రీదేవి మ‌ర‌ణంలో అనుమానాలున్నాయ‌ని ‘సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేయ‌డం ప్రారంభించారు. ఆగ‌స్ట్ 13న శ్రీదేవి జ‌యంతి సంద‌ర్భంగా ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మ‌రి సోష‌ల్ మీడియాలో శ్రీదేవి అభిమానుల రచ్చ ఎంత వ‌ర‌కు దారి తీస్తుందో చూడాలి.

More News

‘దృశ్యం’ దర్శకుడి పరిస్థితి విషమం..

‘దృశ్యం’ దర్శకుడి పరిస్థితి విషమంగా ఉంది. బాలీవుడ్‌లో ‘దృశ్యం’ చిత్రాన్ని అజయ్ దేవగన్‌తో తెరకెక్కించిన నిషికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.

సంజ‌య్ ద‌త్‌కు లంగ్స్ క్యాన‌ర్!!

బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్‌ద‌త్‌కి మూడు రోజుల క్రితం శ్వాస‌కోశ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ముంబైలోని నానావ‌తి హాస్పిట‌ల్‌లో

‘నారప్ప’ రిలీజ్ ఎప్పుడంటే‌..?

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం త‌మిళ చిత్రం ‘అసుర‌న్‌’ తెలుగులో రీమేక్ ‘నార‌ప్ప‌’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

‘ల‌వ్‌స్టోరి’ కోసం విలేజ్ సెట్‌

తెలుగులో ఫిదా చిత్రంతో ప్రేక్ష‌కుల హృద‌యాల్ని దోచుకున్న సాయిప‌ల్లవి త‌ర్వాత ఏంసీఏ, క‌ణం త‌దిత‌ర చిత్రాల్లో

ఆర్జీవీకి కరోనా.. నల్లగొండ కోర్టుకు వెల్లడించిన లాయర్

తాను సూపర్ ఫైన్‌గా ఉన్నానని.. డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ అంటూ నిన్న డంబెల్స్ పట్టుకుని ట్విట్టర్‌లో