సుశాంత్ వంట మనిషి విచారించిన సీబీఐ
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి పెను సంచలనానికి తెరదీసిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. సూపరింటెండెంట్ నుపుర్ ప్రసాద్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. కాగా.. ఈ సీబీఐ అధికారులు ఇప్పటికే విచారణను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ముంబై పోలీసులను కలిసి సుశాంత్ కేసుకు సంబంధించిన రికార్డులను, పోస్టుమార్టం రిపోర్టును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సుశాంత్ కేసులో కీలక సాక్షి అయిన ఆయన వంట మనిషిని సీబీఐ అధికారులు విచారించారు.
సుశాంత్ మరణించినప్పటి నుంచి అతడి మరణానికి సంబంధించి అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్లో నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటుంటే, మరికొందరేమో సుశాంత్ హత్యకు గురయ్యాడని ఆరోపిస్తున్నారు. మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్ కూడా తన కుమారుడిని రియా చక్రవర్తి తీవ్ర వేధింపులకు గురి చేసిందని.. అతడి అకౌంట్ నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకుందని బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మరోవైపు సుశాంత్ మృతి కేసులో అండర్ వరల్డ్ ప్రమేయముందని మాజీ ‘రా’ అధికారి ఒకరు ఆరోపించారు. సుశాంత్ హత్యకు భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందని.. పైగా ఎలాంటి కేసూ లేకుండా చూస్తామని చెప్పి అండర్ వరల్డ్ చేత హత్య చేయించి ఉంటారని సదరు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ కేసులో పోలీసుల దృష్టిని తమ నుంచి మరల్చేందుకే అతని అకౌంట్ నుంచి వేరే అకౌంట్లకు డబ్బును బదిలీ చేసేందుకు యత్నించారని కూడా ఆరోపించారు. ఏదైతేనేమి ఈ కేసులో నిజానిజాలు మాత్రం సీబీఐ వెలుగులోకి తీసుకొస్తుందని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout