CBI Court :జగన్ , విజయసాయిరెడ్డిలకు ఊరట.. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ గ్రీన్ సిగ్నల్

  • IndiaGlitz, [Friday,September 01 2023]

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలకు కోర్టులో ఊరట లభించింది. వీరిద్దరూ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణ జరిపిన సీబీఐ న్యాయస్థానం గురువారం తుది తీర్పు వెలువరించింది. జగన్, విజయసాయిరెడ్డిలు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. వీరిద్దరి విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ.. న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. విదేశీ టూర్‌కు అనుమతిస్తే సాక్షులను వీరు ప్రభావితం చేసే అవకాశం వుందని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే న్యాయస్థానం నుంచి జగన్, విజయసాయిరెడ్డిలకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

కాగా.. సీఎం వైఎస్ జగన్ లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు యూకే వెళ్లనున్నారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు ఆయన యూకేలో పర్యటిస్తారు. అటు ఎంపీ విజయసాయిరెడ్డి విషయానికి వస్తే.. విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లనున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ ఏ1, ఏ2గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గతంలో సీబీఐ వీరిని అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే బెయిల్ షరతుల్లో పాస్‌పోర్ట్‌ను న్యాయస్థానానికి సమర్పించాలని.. కోర్ట్ అనుమతితోనే విదేశీ పర్యటనలకు వెళ్లాలన్న షరతులు వున్నాయి. ఈ నేపథ్యంలో జగన్, విజయసాయిరెడ్డిలు కోర్ట్ అనుమతితోనే విదేశాలకు వెళ్తున్నారు. తాజాగా ఇప్పుడు మరోసారి న్యాయస్థానం అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేశారు.

More News

Tiger Nageswara Rao:టైగర్ నాగేశ్వరరావుకు షాక్.. రిలీజ్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్, కారణమిదే

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. 1970-80 దశకాల్లో స్టువర్ట్ పురం ప్రాంతంలో నివసించిన టైగర్ నాగేశ్వరరావు

ఎంతకు తెగించార్రా.. ఏకంగా సుప్రీంకోర్ట్ పేరుతో ఫేక్ వెబ్‌సైట్, సీజేఐ జాగ్రత్తలు

కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులు , ప్రముఖులు, వ్యక్తులు, బ్రాండ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.

కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా .. రేపటికి వాయిదా

దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వారికి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తండ్రీకొడుకులు పాదం మోపారు.. వరుణుడు పారిపోయాడు, సెంటిమెంట్ దెబ్బకు జనం గగ్గోలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు గుర్తుచేసుకుంటే.. ఆయన హైటెక్ పాలనతో పాటు వర్షాలు కూడా గుర్తొస్తాయి. దురదృష్టమో, శాపమో తెలియదు గానీ చంద్రబాబు రాష్ట్ర పగ్గాలు

రాష్ట్రంలో వర్షాభావ పరిస్ధితులు .. ఆ రెండు పాదాల మహిమే : ఎంపీ అవినాష్ రెడ్డి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయి. ఆగస్ట్ పోయి సెప్టెంబర్ వస్తున్నా నేటికి సరైన వర్షాలు లేవు. ఎల్ నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం లేదని