Kavitha:తిహార్ జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
Send us your feedback to audioarticles@vaarta.com
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(Kavitha) మరో భారీ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసులో ఇప్పటికే ఆమె తీహార్ జైలులో తాజాగా, ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా కవితను సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇటీవల ఈ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 6న ఆమెను జైలులో ప్రశ్నించింది. తాజాగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించనుంది. కవిత రెగ్యులర్ పిటిషన్ పై ఈ నెల 16న విచారణ జరగనున్న నేపథ్యంలో సీబీఐ సీబీఐ కస్టడీలోకి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి ఆమె కుట్రలు పన్నారని సీబీఐ ఆరోపించింది. ఈ క్రమంలో కవితను జ్యుడీషీయల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. గతంలో కవితను విచారించిన సమయంలో నమోదు చేసిన స్టేట్‌మెంట్, అప్రూవర్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ముఖ్యంగా భూముల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ కవితను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. దీంతో కవిత నుంచి మరింత సమాచారం రాబట్టిన తర్వాత మరో ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశముంది. ఢిల్లీ మద్యం కేసులో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం విధితమే. కాగా మార్చి 15న లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండగా తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి మారారు. ఇందులో భాగంగా తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర అని రూ.100కోట్లు చేతులు మారాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్టై తిహార్ జైలులోనే ఉంటున్నారు. మొత్తానికి ఈ కేసులో కవితకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout