చిరు తో డ్యాన్స్ చేయనున్న ఎమ్మెల్యే...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తో డ్యాన్స్ చేయడానికి ఎమ్మెల్యే రెడీ అవుతుందట. ఎవరా ఎమ్మెల్యే అనుకుంటున్నారా..? రియల్ లైఫ్ ఎమ్మెల్యే కాదు...రీల్ లైఫ్ ఎమ్మెల్యే. అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో ఎమ్మెల్యే పాత్ర పోషించింది హీరోయిన్ కేథరిన్. ఇప్పుడు కేథరిన్ మెగాస్టార్ చిరంజీవి తో డ్యాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్టు సమాచారం.
ఇంతకీ విషయం ఏమిటంటే...చిరు 150వ చిత్రంలో హీరోయిన్ గా నయనతార పేరు వినిపించింది. ఇప్పుడు అనుష్క పేరు వినిపిస్తోంది. అయితే...ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. కానీ...ఈ క్రేజీ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో కేథరిన్ నటించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే...కేథరిన్ కి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com