రెండు విధాలుగానూ సక్సెస్ అయింది
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక సినిమాలో నెగెటివ్ టచ్ ఉన్న రెండో హీరోయిన్ పాత్ర.. మరో సినిమాలో ఐటం గర్ల్. కట్ చేస్తే.. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలై ఆ ముద్దుగుమ్మ ఖాతాలో రెండు విజయాలని చేర్చాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఎస్. ఆమే కేథరిన్ ట్రెసా.
'సరైనోడు' ముందు వరకు ఐరెన్‌లెగ్ హీరోయిన్ అనిపించుకున్న కేథరిన్.. ఇప్పుడిప్పుడే ఆ ఇమేజ్ నుంచి బయటపడుతోంది. 'సరైనోడు' తరువాత వచ్చిన గౌతమ్ నంద డిజాస్టర్ అయినా.. ఆ తరువాత వచ్చిన రెండు చిత్రాలు ఆమెకు పాజిటివ్ రిజల్ట్‌నే ఇచ్చాయి. ఆ చిత్రాలే 'నేనే రాజు నేనే మంత్రి', 'జయజానకి నాయక'. ఈ ఆగస్టు 11న విడుదలైన ఈ రెండు చిత్రాలూ కేథరిన్ కెరీర్‌కి ప్లస్ అయ్యాయి.
'నేనే రాజు నేనే మంత్రి'లోని దేవికా రాణి అనే పాత్రలో విలనిజాన్ని బాగానే ప్రదర్శించిన కేథరిన్.. 'జయజానకి నాయక' లోని 'ఏ ఫర్ ఆపిల్' సాంగ్‌లో అందాలను బాగానే ప్రదర్శించింది. ఇలాగే సక్సెస్‌లని తన ఖాతాలో వేసుకుంటూపోతే.. కేథరిన్ దశ ఏదో ఒక రోజు మారకపోదు అంటున్నారు విశ్లేషకులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout