చిరు మూవీలో క్యాథరిన్ ఔట్..రాయ్ ఇన్

  • IndiaGlitz, [Thursday,October 13 2016]

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా, ప్రెస్టిజియ‌స్ 150 మూవీ 'ఖైదీ నంబ‌ర్ 150'. చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్బంగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రాంచ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త‌మిళ చిత్రం క‌త్తి కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో త‌రుణ్ అరోరా విల‌న్‌గా న‌టిస్తుంటే కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాలో క్యాథ‌రిన్ థెస్రా ఓ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. యూనిట్ వ‌ర్గాలు కూడా ఖ‌రారు చేశాయి. అయితే ఏమైంతో ఏమో కానీ ఇప్పుడు లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాలో క్యాథ‌రిన్ ప్లేస్‌లో ల‌క్ష్మీరాయ్ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంద‌ట‌. మ‌రి క్యాథరిన్ స్పెష‌ల్ సాంగ్ ఎందుకు చేయ‌లేద‌నే దానిపై ఎటువంటి స‌మాచారం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌లో స్పెష‌ల్ సాంగ్ చేసిన ల‌క్ష్మీరాయ్ ఇప్పుడు అన్న‌య్య చిరంజీవితో కాలు క‌దప‌నుంది.