కేతరీన్ సరికొత్త డ్యాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, స్టైల్ సాధించుకొన్న నటీమణి కేతరీన్ థెరీసా. ఈ అందాల భామ ఇటీవల "నేనే రాజు నేనే మంత్రి"తో నటిగా మంచి విజయంతోపాటు పేరు కూడా సంపాదించుకొంది. త్వరలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైతీ మూవీ మేకర్స్ రవితేజ హీరోగా రూపొందించనున్న చిత్రంలో కథానాయికగా నటించే క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకొంది.
ప్రస్తుతం ఓ రెండువారాల పాటు న్యూయార్క్ లో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయడం కోసం అమెరికా వెళ్ళిన కేతరీన్.. అక్కడ మిస్ వీ అనే వరల్డ్ పాపులర్ డ్యాన్సర్ దగ్గర క్రాష్ కోర్స్ జాయిన్ అయ్యింది. ఆల్రెడీ మంచి డ్యాన్సర్ అయిన కేతరీన్ తన కొత్త గురువు మిస్.వీ దగ్గర పాపింగ్ అండ్ లాకింగ్ స్టైల్ లో ట్రయినింగ్ తీసుకోనుంది. ఆల్రెడీ ట్రయినింగ్ మొదలయ్యింది. ఈ సరికొత్త డ్యాన్స్ మూవ్స్ కేవలం తన డ్యాన్సింగ్ స్కిల్స్ పెంపొందించుకోవడం కోసం మరియు తన సరికొత్త సినిమాలలో ప్రేక్షకులను అలరించడం కోసమేనని కేతరీన్ పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com