స్టార్ కొరియోగ్రాఫర్‌పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు
- IndiaGlitz, [Wednesday,January 29 2020]
జాతీయస్థాయి కొరియోగ్రాఫర్స్‌లో బాలీవుడ్‌కి చెందిన కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన పలు చిత్రాల్లోనూ నటించారు. ఇప్పుడు ఈయన కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో చిక్కుకున్నారు. గణేశ్ ఆచార్య తనను బ్లూ ఫిలిమ్స్ చూడమని వేధిస్తున్నాడంటూ 33 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లోనూ గణేశ్ ఆచార్య పేరు ప్రముఖంగా వినపడింది. ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ సైతం ఆయనపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. తర్వాత ఎందుకనో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కానీ ఇప్పుడు ఆయనపై ఆరోపణలు చేసిన మహిళ ఏకంగా జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో మరోసారి ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. ముంబైలోని గణేశ్ ఆచార్య ఆఫీసుకి వెళితే తన రెమ్యునరేషన్లో కమీషన్ అడిగేవాడని, ఇవ్వనని చెబితే బ్లూఫిలిమ్స్ చూడమని వేధించేవాడని, కుదరదని చెప్పినందుకు తనపై బౌతికంగా దాడి చేశారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే గణేశ్ ఆచార్య తనపై వస్తున్నవి ఆరోపణలు మాత్రమేనని, నిజాలు కావని అంటున్నారు. తనపై ఫిర్యాదు చేసిన మహిళపై తాను పరువు నష్టం దావా వేస్తానని అంటున్నారాయన. మరి ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.