సీన్ రివర్స్ అశ్వత్థామపై తిరుగుబాటు.. భవిష్యత్తేంటో!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘంలో ముసలం మొదలైందా? తప్పు చేశామని.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ తమను మోసం చేశారని కార్మికులకు తెలిసొచ్చిందా..? అందుకే అశ్వత్థామపై సొంత యూనియన్‌కు చెందిన కార్మికులు తిరుగుబాటు చేస్తున్నారా..? సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ కార్మికలంతా తిరిగి విధుల్లో చేరాలని మనసు మార్చుకున్నారా..? తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
సింగిల్ వార్నింగ్ పరిస్థితులు మారిపోయాయ్!
తమ డిమాండ్స్‌ను పరిష్కరించాలని ఒకరోజు.. రెండ్రోజులు కాదు 20 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం వారి డిమాండ్స్‌ను అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు కనీసం ఆర్టీసీ విషయంలో ఫలానా చేస్తానని హుజూర్నగర్ ఎన్నిక ఫలితం ముందు వరకూ చెప్పలేదు. ఎప్పుడైతే ఫలితం వచ్చిందో ఇక కేసీఆర్ మీడియా ముందుకొచ్చి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక అంతే.. ‘ఆర్టీసీ ఖతం.. ఇక సమ్మె కాదు కదా ఆర్టీసీనే ఉండదు’ సింగిల్ లైన్‌తో తేల్చిపడేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు ఊహించని షాక్ తగిలినట్లైంది. ఈ క్రమంలో కార్మికుల గురించి కేసీఆర్ ఘాటుగానే మాట్లాడారు.
సీన్ రివర్స్..!
ఇక అసలు విషయానికొస్తే.. అశ్వత్థామను బీజేపీ నేతలు డబ్బులు ఆశచూపి కొన్నారని వాళ్లు చెప్పిందే వేదంగా భావిస్తూ ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీదికి లాగారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఏం జరిగిందో ఏమో.. కార్మికులు ఏమేం నిజాలు తెలుసుకున్నారో గానీ.. అశ్వత్థామపై రివర్స్ కేసులు పెట్టడం మొదలుపెట్టారు. సమ్మె వ్యవహారంలో ఆత్మహత్య, చనిపోయిన వారి మరణాలకు కారణం ఆయనేనని కొందరు కార్మికులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన డ్రైవర్ కోరేటి రాజు.. కన్వీనర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అశ్వత్థామ వ్యక్తిగత కోరిక!
ఈ ఫిర్యాదులో ఆసక్తికర విషయాలను రాసుకొచ్చారు.‘ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు విలీనం అనేది తమ డిమాండ్ కాదు.. అది అశ్వత్థామ వ్యక్తిగత కోరిక. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. విలీనం.. విలీనం అంటూ ఆర్టీసీ కార్మికుల్లో ఆయన విషం నింపుతున్నారు’ అని తీవ్రస్థాయిలో డ్రైవర్ రాజు చెప్పడం గమనార్హం. మరి ఇదే మాటలు కార్మికులు అంతా అంటే.. ‘అశ్వత్థామ హత:’ అవుతుందేమో.!
కార్మికులు ఏం చేయబోతున్నారు..!?
మొత్తానికి చూస్తే అశ్వత్థామపై తిరుగుబాటు అయితే మొదలైంది.. ఇది ఎంతవరకు వెళ్తుందో ఏంటో. ఇదిలా ఉంటే.. కార్మికులు మంచివారేనని, యూనియన్ నాయకులే తప్పుదోవపట్టిస్తున్నారని ఇటీవల కేసీఆర్ తన ప్రెస్మీట్లో అనడంతో ఇక జరిగిందేదో జరిగిపోయింది.. సమ్మెకు మాకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ సమ్మె వ్యవహారాన్ని కార్మిక సంఘాల నేతల మీదకి నెట్టి కార్మికులు విధుల్లోకి వెళ్లి ఉద్యోగాలు నిలుపుకుంటారా..? లేదా అశ్వత్థామ చెప్పినట్లే చేసుకుంటూ పోతారా..? అనేది అతి త్వరలోనే తేలిపోనుంది. మరి మున్ముంథు పరిస్థితులు ఎలా ఉంటాయో..!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout