చలపతిరావు, యాంకర్ రవిలపై కేసు నమోదు
Send us your feedback to audioarticles@vaarta.com
చలపతిరావు నోటి దూలతో చేసిన వ్యాఖ్యలు ఆయన్ను అంత ఈజీగా వదలేలా కనపడటం లేదు. చలపతిరావు మహిళలపై చేసి అసభ్యకర వ్యాఖ్యలపై, ఆయన్ను బలపరిచిన యాంకర్ రవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బండ్లగూడకు చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనాకుమారి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
పిర్యాదు స్వీకరించిన పోలీసులు ఐపీసీ 354 ఏ(4), 509 సెక్షన్లపై కేసు నమోదు చేశారట. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియోకలో చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చేలరేగింది. మా అసోషియేషన్ ఈ వ్యాఖ్యలపై మహిళలకు క్షమాపణలు తెలిపింది. అలాగే చలపతిరావు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments