మోసగాడి వలకు చిక్కిన ఎంపీ కేకే.. లాస్ట్‌లో కథ అడ్డం తిరిగింది..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎంపీ కేకే చాలా సులభంగా మోసగాడి వలకు చిక్కేశారు. అయితే లాస్ట్‌లో కథ అడ్డం తిరిగింది. మహేష్ అనే మోసగాడు ఎంపీ కేకేకు ఫోన్ చేసి.. తనను తాను కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు. నిరుద్యోగులకు రుణాలిస్తున్నామని.. కాబట్టి కేకే నియోజకవర్గంలోని ఓ పాతిక మందిని ప్రతిపాదిస్తే వారికే రుణం అంద చేస్తామని తెలిపాడు. ఒక్కొక్కరికీ రూ.25 లక్షల మేర రుణం ఇస్తామని.. అందులో కేంద్ర సబ్సిడీ 50 శాతమని నమ్మబలికాడు. దీని కోసం మంత్రి కేటీఆర్ పేరును సైతం సదరు మోసగాడు వాడుకున్నాడు. కేటీఆర్ చెబితేనే మీకు ఫోన్ చేశానని కేకేకు చెప్పాడు.
కేటీఆర్ పేరు చెప్పడంతో నమ్మేసిన కేకే.. వెంటనే తన కూతురు విజయలక్ష్మికి ఫోన్ చేసి విషయం చెప్పారు. విజయలక్ష్మి గద్వాల్ కార్పొరేటర్‌గా పని చేస్తున్నారు. వెంటనే విజయలక్ష్మి ఒక 25 మంది నిరుద్యోగులను ఎంపిక చేశారు. వెంటనే మహేష్‌కు ఫోన్ చేశారు. అయితే ప్రతి లబ్ధిదారుడు ముందుగా రూ.1.2లక్షలను కాషన్ డిపాజిట్‌గా చెల్లించాలని షరతు పెట్టాడు. ఎలాంటి అనుమానాన్ని రానివ్వకుండా డీడీలు కట్టాలని సూచించాడు. అయితే అప్పటికే మధ్యాహ్నం 3 గంటలు దాటడంతో బ్యాంక్ క్లోజింగ్ సమయం కావడంతో తన ఖాతాలో డిపాజిట్ చేయాలని తెలిపాడు. దీంతో ఎంపీ కేకేకు అనుమానం వచ్చింది.
మహేష్‌కు ఫోన్ చేసిన కేకే ఎక్కడున్నారని ప్రశ్నించారు. దీంతో మహేష్ తాను ప్రగతి భవన్లో ఉన్నానని.. మంత్రి కేటీఆర్‌కు ఈ స్కీమ్ గురించి వివరిస్తున్నానని వెల్లడించారు. వెంటనే కేకే.. కేటీఆర్‌కు కాల్ చేశారు. కాగా.. కేటీఆర్ తాను ఢిల్లీలో ఉన్నానని చెప్పడంతో షాక్ అయ్యారు. దీంతో తనకు ఫోన్ చేసిన వ్యక్తి మోసగాడని కేకే గ్రహించారు. అప్పటికే రూ.50 వేలు డిపాజిట్ చేసిన అఖిల్ అనే నిరుద్యోగితో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు మోసగాడు నిజామాబాద్‌లోని ఓ ఏటీఎం నుంచి రూ.40 వేలు డ్రా చేసినట్టు గుర్తించారు. ఆ ఏటీఎంకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో మోసగాడిని గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments