హెలికాఫ్టర్‌లో పెళ్లికి హైదరాబాద్ కుటుంబం.. కేసు నమోదు
Send us your feedback to audioarticles@vaarta.com
హంగూ ఆర్భాటాల కోసమో.. రిచ్‌నెస్‌ను ప్రదర్శించుకోవడం కోసమో.. లేదంటే మరే కారణమో కానీ.. ఓ వ్యాపారవేత్త కుటుంబం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి నెల్లూరుకు పెళ్లికి వెళ్లింది. ఊరిలో హెలికాఫ్టర్ వచ్చి ల్యాండ్ అవగానే అదో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆ కుటుంబ సభ్యులు హెలికాఫ్టర్ నుంచి దిగి ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతా సందడి సందడిగా సాగిపోయింది. పెళ్లి తతంగం ముగిసిన అనంతరం ఆ కుటుంబం ఆనందంగా తిరిగి అదే హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ చేరుకుంది.
ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ కొన్ని గంటల్లోనే కథ అడ్డం తిరిగింది. హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఆ కుటుంబంపై కేసు నమోదైంది. దీనికి కారణం.. నెల్లూరులోని అనంతసాగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తమ హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడమే. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి.. రెవెన్యూ, విద్యాశాఖాధికారుల వరకూ వెళ్లింది. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ ల్యాండింగ్‌తో పాటు టేకాఫ్ చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే హెలికాప్టర్ సంస్థ అన్ని అనుమతులు తీసుకున్నాకే తమను హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తీసుకొని వచ్చి వెళ్లిందని సదరు వ్యాపారవేత్త వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త ఏపీ తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments