CM Jagan:సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం జగన్(Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నిందితుడు సీఎంను అంతమొందించాలనే ఉద్దేశంతోనే దాడి చేశాడని పేర్కొన్నారు.
'సీఎం జగన్‌కు ఒకసారి రాయి తగలకపోవడంతో రెండోసారి మిస్ కాకుండా దాడికి పాల్పడ్డాడు. డాబా కోట్ల సెంటర్లో దాడి చేసేందుకు యత్నించాడు. వివేకానంద స్కూల్ పక్కన ఉన్న బెంచ్ దగ్గరకు వెళ్లి సతీష్ రాయితో దాడి చేశాడు. అక్కడ తోపులాట ఉండడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా సతీష్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసి ఫోన్ కూడా సీజ్ చేశాం. అదును చూసి సున్నితమైన తల భాగంలోనే కుట్ర ప్రకారం రాయితో దాడి చేశారు. ఈ కేసులో ఏ2 దుర్గారావు ప్రోద్బలంతోనే సతీష్ దాడి చేశాడు' అని రిపోర్టులో తెలిపారు.
అంతకుముందు ఈ కేసులో ఏ1గా ఉన్న నిందితుడు సతీష్‌ను గురువారం విజయవాడ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అతడు నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదని.. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా అని వాదించారు. అయితే దురుద్దేశపూర్వకంగానే నిందితుడు సీఎంపై రాయితో దాడి చేశాడని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సతీష్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.
కాగా ఈనెల 13వ తేదీన మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌పై రాయి దాడి జరిగిదివిషయం విధితమే. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుబొమ్మ పై భాగంలో గాయం అయింది. దాడి సమయంలో సీఎం పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం అయింది. వెంటనే అలర్ట్ అయిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను బస్సులోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది ఆకతాయిల పని కాదని సీఎం హత్యకు కుట్ర పన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి కౌంటర్‌గా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మొత్తానికి సీఎం జగన్‌పై రాయి దాడి కేసు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments