హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు.. కారణమిదే
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాలు, షూటింగులు తప్పా పర్సనల్ విషయాలతో రవితేజ ఎప్పుడూ వార్తల్లో ఉండరు. ఆయన కుటుంబం కూడా ఎక్కువగా బయట కనిపించదు. ఆ మధ్య ఆయన సోదరుడు భరత్ చనిపోవడంతో తప్పించి.. మళ్లీ రవితేజ ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు మీడియాలో కనిపించలేదు. తాజాగా రవితేజ మాతృమూర్తికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
రవితేజ తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నది ఆ వార్తల సారాశం. ఆయన తల్లి భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తి ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా వారు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారంటూ పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భూపతి రాజ్యలక్ష్మి, సంజయ్‌పై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం రాజ్యలక్ష్మి తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెపై కేసుకు సంబంధించి రవితేజ నుంచి గానీ, ఆయన సిబ్బంది నుంచి గానీ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్‌లు వున్నాయి. ఖిలాడీ, రావణాసుర, ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు వీటిలో వున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments