కబాలి రిలీజ్ కి అడ్డంకులు..
Thursday, July 21, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ఈనెల 22న అనగా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావాలి. అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు కబాలి చిత్రాన్ని చూస్తామా అని ఎదురు చూస్తుంటే...కబాలి చిత్రం రిలీజ్ ఆపాలంటూ ఓ వ్యక్తి చెన్నై హైకోర్టులో పిటిషన్ వేసారు. ఇంతకీ కబాలి రిలీజ్ ఆపాలని పిటిషన్ వేసిన వ్యక్తి ఎవరంటే... శుక్ర ఫిలిమ్స్ సంస్థ భాగస్వామి ఆర్.మహాప్రభు. ఈయన రజనీకాంత్ నటించిన లింగా సినిమాను పంపిణీ చేశారు. లింగా సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ సమయంలో మహా ప్రభుకి లింగా నిర్మాత వెంకటేష్, రజనీకాంత్ నష్టపోయిన మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారట. అయితే ఇంకా తనకు 89 లక్షలు రావాల్సి ఉంది. ఆ బాకీ తీర్చే దాకా కబాలి రిలీజ్ ఆపేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషిన్ ని స్వీకరించిన హైకోర్టు గురువారం దీనిపై విచారణ చేయనుంది. హీరో రజనీకాంత్, నిర్మాత కలై ఫులి ఎస్ థానుకు హైకోర్టు నోటిసులు పంపింది. మరి..కోర్టు ఏ తీర్పు ఇవ్వనుందో ఈరోజు తెలియనుంది. ఈ తీర్పు పై కబాలి రిలీజ్ ఆధారపడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments