Suresh Babu: రూ.18 కోట్ల భూ వివాదం.. బెదిరింపులు : దగ్గుబాటి సురేష్ బాబు, రానాలపై కేసు నమోదు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన కుమారుడు హీరో రానాలు వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్థల వివాదంలో వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఫిలింనగర్ కో ఆపరేటివ్ సొసైటీలోని 1000 గజాల స్థలం అమ్మకం విషయంలో సురేష్ బాబు తమతో కుదుర్చుకున్న ఒప్పందం అమలు చేయడం లేదని బంజారాహిల్స్‌కు చెందిన ప్రమోద్ కుమార్ పచ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తమను రౌడీలతోనూ బెదిరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వద్ద డబ్బు తీసుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించడం లేదని తెలిపారు. అయితే తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రమోద్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సురేష్ బాబు, రానా సహా కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే:
షేక్‌పేట మండలం సర్వే నెం.403లోని ఫిలింనగర్ రోడ్ నెంబర్ 1లో సినీ నటి మాధవికి చెందిన ఫ్లాట్ నెంబర్ 2లో వున్న 1007 గజాలను కొద్దిరోజుల క్రితం సురేష్ బాబు కొనుగోలు చేశారు. ఆ పక్కనే సురేష్ బాబు సోదరుడు, హీరో వెంకటేశ్ తనకు చెందిన ఫ్లాట్ నెంబర్ 3లోని 1000 గజాలను ప్రమోద్‌కు 2014లో లీజుకు ఇచ్చారు. లీజు గడువు ముగుస్తుండగా 2018లో .. ఫ్లాట్ నెంబర్ 2లోని స్థలాన్ని రూ.18 కోట్లకు విక్రయించేందుకు సురేష్ బాబు ప్రయత్నాలు చేస్తుండటతో ప్రమోద్ రూ.5 కోట్లు చెల్లించి, అగ్రిమెంట్ రాసుకున్నారు.
వివాదంలో వుండగానే స్థలాన్ని విక్రయించిన సురేష్ బాబు:
అయితే అంతకుముందు లీజు గడువు ముగిసినా ప్రమోద్ ఖాళీ చేయడం లేదంటూ ప్రమోద్‌పై సురేష్ న్యాయపరంగా కేసు వేసి నోటీసులిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో సురేష్ బాబుపై ప్రమోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దగ్గర రూ.5 కోట్లు అడ్వాన్స్ తీసుకుని సురేష్ బాబు రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు. అలా మొత్తం ఈ భూ వివాదానికి సంబంధించి మొత్తం 5 కేసులు పలు కోర్టుల్లో విచారణ దశలో వున్నాయి. కానీ ఈ వివాదం సద్దుమణగకుండానే సురేష్ బాబు ఈ స్థలాన్ని విక్రయించేశారు. అంతేకాదు..గతేడాది నవంబర్‌లో లీజు స్థలంలో వుంటున్న ప్రమోద్ సెక్యూరిటీని తరిమికొట్టడంతో పాటు ఆయనను బెదిరించారు. ఈ క్రమంలోనే ఆయన తొలుత పోలీసులను , ఆపై నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com