చిరు పరవు తీయకు.. నాగబాబుపై కేసు నమోదు
Send us your feedback to audioarticles@vaarta.com
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పేర్కొంటూ జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు ట్వీట్ చేశారు. గాడ్సే పుట్టిన రోజు కావడంతో నాగబాబు వరుస ట్వీట్స్ చేశారు. దీంతో నెటిజన్లు, జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు జనసేన కార్యకర్తలయితే దుమ్మెత్తి పోస్తున్నారు. వివాదాల కోసమే ఇలా చేస్తున్నారా..? లేకుంటే మీరు చేయాల్సిన పనులేమీ లేవని ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారా..? అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు.. ఈ ట్వీట్‌తో సినీ, రాజకీయ వర్గాల్లో కొత్త చర్యలు మొదలయ్యాయి. కాగా.. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సొంత అభిమానులే తిట్టిపోస్తుండటం గమనార్హం.
ట్విట్టర్ బ్యాన్ చేసి.. !
ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న పలువురు కాంగ్రెస్ నేతలు, పలువురు ప్రజా సంఘ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలు మండిపడుతున్నారు. కొందరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి మరీ కేసులు పెడుతున్నారు. టీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ నేత మానవతారాయ్ హైదరాబాద్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తక్షణమే నాగబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ‘మహాత్మ గాంధీని నాగబాబు అవమానించాడు. గాంధీ శాంతికి నిదర్మనం. అలాంటి గాంధీని హత్య చేసిన గాడ్సేను నాగబాబు పొగిడారు. ఆయన నిజమైన దేశభక్తుడు అని చెప్పి గాంధీని అవమానించాడు. ట్విట్టర్‌లో నాథూరామ్‌ను పొగుడుతూ గాంధీని అవమానించడం దేశాన్ని కించపర్చడమే. వెంటనే నాగబాబు ట్విట్టర్ ఖాతాను బ్యాన్ చేయడమే కాకుండా దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
చిరు పరువు తీయకు!
ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నేత స్పందిస్తూ నాగబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మీడియాతో మాట్లాడుతూ.. మీ తెలివి తక్కువతనంతో మీ అన్న చిరంజీవి పరువు తీయవద్దని మండిపడ్డారు. మొత్తానికి చూస్తే నాగబాబు చేసిన వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. కేసుల దాకా వెళ్లిన ఈ వివాదం ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments