మహిళలపై లైంగిక వేధింపులు.. కోయిలమ్మ సీరియల్ హీరోపై కేసు నమోదు
Send us your feedback to audioarticles@vaarta.com
కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాగిన మైకంలో మణికొండలో ఇద్దరు అమ్మాయిలపై అమర్ దౌర్జన్యానికి దిగినట్టు తెలుస్తోంది. ఒంటరిగా ఉన్న మహిళలతో అసభ్యంగా మాట్లాడినట్టు సమాచారం. గత రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. శ్రీవిద్య, స్వాతి, లక్ష్మి అనే ముగ్గురు మహిళలు మణికొండలో బొటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ వ్యాపారం నుంచి స్వాతి తప్పుకుంది. ప్రస్తుతం శ్రీవిద్య, లక్ష్మి దానిని నిర్వహిస్తున్నారు.
కాగా.. స్వాతికి సంబంధించిన వస్తువులను శ్రీవిద్య ఇవ్వకుండా తన వద్దే ఉంచుకుంది. గత రాత్రి స్వాతి కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్‌తో కలిసి శ్రీవిద్య ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే శ్రీవిద్య ఇంట్లో మాట మాట పెరిగి అది కాస్త గొడవకు దారి తీసింది. దీనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే శ్రీవిద్య మాత్రం తన వద్ద ఉన్న వస్తువులను లాక్కెళ్లడమే కాకుండా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఐదు లక్షల నగదు తీసుకున్నారని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇరువురి ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com