బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు..
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరిద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు సుమోటాగా కేసులు నమోదు చేశారు. ఐపీసీ 505 సెక్షన్ కింద వీరివురిపై కేసులు నమోదయ్యాయి. బండి సంజయ్, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో సామాజికంగా ఘర్షణలు చెలరేగే అవకాశాలున్నాయని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.
ఇటీవల బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పాత బస్తీలో అక్రమంగా రోహింగ్యాలు నివసిస్తున్నారని, వారిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని వ్యాఖ్యానించారు. ఆ తరువాత అక్బరుద్దీన్ ఒవైసీ అక్రమ నిర్మాణాలపై మాట్లాడుతూ... హుస్సేన్ సాగర్‌ను ఆక్రమించి కట్టిన ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలని పేర్కొన్నారు. దీనికి బండి సంజయ్ స్పందిస్తూ... పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూలిస్తే... రెండు గంటల్లోనే దారుస్సలాంను కూల్చేస్తామని ఛాలెంజ్ విసిరారు. ఈ సవాళ్లు.. ప్రతి సవాళ్లు సామాజిక ఘర్షణలకు దారి తీసే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout