సమంత ఐటెం సాంగ్‌పై రాజుకుంటున్న వివాదం.. బ్యాన్ కోరుతూ, ఏకంగా హైకోర్టుకి
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత తన జీవితంలో తొలిసారి చేసిన ఐటెం సాంగ్ వివాదాస్పదమైంది. అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్పలో సామ్... చేసిన ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అభిమానులను అలరిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా... ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి 30 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అటు ఈ పాటతో పుష్పకు కూడా హైప్ పెరిగింది. అంతా ఫుల్ హ్యాపీగా వున్న సమయంలో మగవాళ్ల సంఘం ఒకటి షాకిచ్చింది. మగాళ్లంతా కామాంధులు అన్న తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఈ పాటలోని సాహిత్యం వుందంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పుష్ప టీంతో పాటు పాటలో నర్తించిన సమంతపై ఫిర్యాదు చేసిన పురుషుల సంఘం.. తక్షణం ఆ ఐటెం సాంగ్‌పై నిషేధం విధించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇకపోతే పుష్ప తొలి భాగం డిసెంబర్17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు సమంత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే సమంత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె వ్యక్తిగత సిబ్బంది క్లారిటీ ఇచ్చారు. సమంత పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని కొంచెం దగ్గు ఉండటంతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేశారని వెల్లడించారు. ప్రస్తుతం సమంత విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో సామ్ ఆరోగ్యంపై వస్తున్న అసత్య వార్తలను నమ్మొద్దని, అలాగే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com