శ్రీముఖికి అనుకోని షాక్‌...పోలీస్ కేసు

  • IndiaGlitz, [Tuesday,May 05 2020]

ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖికి అనుకోని షాక్ త‌గిలింది. న‌ల్ల‌కుంట్ల‌కు చెందిన వెంక‌ట‌ర‌మ‌ణ శ‌ర్మ అనే వ్య‌క్తి శ్రీముఖిపై ఫిర్యాదు చేశారు. ఇంత‌కు ఆమెపై ఫిర్యాదు ఎందుకు చేశారు? అనే వివ‌రాల్లోకెళ్తే.. జెమినీ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే జూల‌క‌ట‌క అనే కార్య‌క్ర‌మంలో బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్యలు చేసేలా కార్య‌క్ర‌మం చేశార‌ని పేర్కొంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసును న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమెకు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ప్రోగ్రామ్స్‌కు అభిమానులుంటారు. ప‌లు షోస్‌కు ఈమె వ్యాఖ్యాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. గ‌త ఏడాది తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ లో పాల్గొన్నారు. చాటా గ‌ట్టి పోటీని త‌ట్టుకుని అనుకోని విధంగా ఫైన‌ల్‌కు చేరుకున్నారు. ఓ ద‌శ‌లో ఈమె బిగ్‌బాస్ విజేత‌గా నిలుస్తుందంటూ కూడా వార్త‌లు వినిపించాయి. అయితే చివ‌ర‌కు రాహుల్ సిప్లిగంజ్ విన్న‌ర్‌గా నిల‌వ‌డం, శ్రీముఖి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. అయితే కూడా శ్రీముఖి ఏమాత్రం త‌గ్గ‌లేదు. బిగ్‌బాస్ వ‌ల్ల ఆమె క్రేజ్ మ‌రింత పెరిగింది. మ‌రిన్ని షోస్‌కు శ్రీముఖి యాంక‌రింగ్ చేసే అవ‌కాశం ద‌క్కింది.

More News

కేజ్రీవాల్.. వైఎస్ జగన్ నోట ఒకే మాట..!

‘కరోనా మహమ్మారిని ఇప్పటికిప్పుడు నిర్మూలించే పరిస్థితి లేదు. కాబట్టి దాంతో కలిసే సహజీవనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

ఎన్టీఆర్-బన్సాలి చిత్రం తాజా అప్డేట్‌ ఇదీ..!

బాలీవుడ్ ద‌ర్శక నిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీ భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి సినిమా తీస్తారని వార్తలు వస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో..

సాధినేని యామినికి అమెరికాలో అరుదైన గౌరవం

ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మకు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామికవేత్తల

దాస‌రి గురించి చిరు, మోహ‌న్‌బాబు ఏమ‌న్నారంటే..?

ఈరోజు ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు 73వ జ‌యంతి. ఈ రోజు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మంతా క‌లిసి డైరెక్ట‌ర్స్ డే కూడా ప్ర‌క‌టించుకున్నారు. ఈరోజు ఉద‌యం ఫిలించాంబ‌ర్‌లో ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల

రాజ‌మౌళి 'ఆర్ఆర్ఆర్‌' రిలీజ్ ప్లాన్ మార్పు

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఇందులో మ‌న్యం వీరుడు