కోర్టులో శ్రీమంతుడు

  • IndiaGlitz, [Friday,February 26 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ్రీమంతుడు సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ర‌చ‌యిత శ‌ర‌త్ చంద్ర... స్వాతి మాస ప‌త్రిక‌లో అనుబంధ న‌వ‌ల గా అందించిన త‌న క‌థ‌ను డైరెక్ట‌ర్ కొర‌టాల కాపీ కొట్టారంటున్నారు. శ‌ర‌త్ చంద్ర రైట‌ర్స్ అసోసియేష‌న్ లో ఈ క‌థ‌ను రిజిష్ట‌ర్ చేయించార‌ట‌.

అయితే ఈ విష‌యం పై శ్రీమంతుడు నిర్మాత‌లు స్పందిస్తూ...ప‌ది ల‌క్ష‌లు ప‌రిహారం ఇస్తాం. టైటిల్స్ లో ఇప్పుడు పేరు వెయ్య‌లేమ‌ని చెప్పార‌ట‌. మ‌రి ఆత‌ర్వాత ఏమైందో ఏమో...ఈ వివాదం కోర్టుకెక్కింది. ఇంత జ‌రుగుతున్నా డైరెక్ట‌ర్ కొర‌టాల మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వివాదం గురించి స్పందించ‌లేదు. మ‌రి ఈ వివాదం కోర్టుకెక్కింది కాబ‌ట్టి కొర‌టాల స్పందించాలి. మ‌రి..కొర‌టాల ఏమంటారో..? కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.