మా బుద్ధి వంకరా.. సమంత ఐటెం సాంగ్‌పై ‘‘మగాళ్ల’’ సంఘం ఫైర్, బ్యాన్ చేయాలంటూ ఫిర్యాదు
Send us your feedback to audioarticles@vaarta.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ఈ నెల 17 థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలలో వేగం పెంచింది. ఈ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించింది. దానికి రెండు రోజుల ముందు సమంత నటించిన 'ఊ అంటావా మావా ఊ ఊ అంటావా' ఐటెం సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. కెరీర్‌లో తొలిసారిగా సామ్ ఈ తరహా పాటల్లో చేయడం, దేవిశ్రీ ట్యూన్స్, విజ్యువల్స్‌తో మాస్ ఆడియన్స్ ఊగిపోతున్నారు. ప్రస్తుతం ఈ పాట ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. దీనికి చిత్ర యూనిట్ సైతం ఖుషీ అవుతూ.. తమ చిత్రానికి భారీ హైప్ వచ్చిందని సంబరపడుతోంది.
అంతా బాగానే వుంది కానీ ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది. తమ మనోభావాలు దెబ్బతీశారంటూ ‘‘మగవాళ్ల’’ సంఘం ఒకటి 'ఊ అంటావా మావా ఊ ఊ అంటావా' పాటపై మండిపడుతోంది. ఈ పాటను బ్యాన్ చేయాలంటూ కంప్లైంట్ చేసింది. పాటలో లిరిక్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. మగాళ్లను తక్కువ చేస్తూ రాశారని సదరు సంఘం పిటిషన్ లో పేర్కొంది. మగాళ్ల బుద్ధి వంకర బుద్ధి అని.. వాళ్లు కేవలం సెక్స్ గురించే ఆలోచిస్తారన్నట్లుగా లిరిక్స్ ఉన్నాయని మండిపడుతున్నారు. ఈ సాంగ్ ను వెంటనే బ్యాన్ చేయాలంటూ ఈ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ వివాదంపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇక పుష్పలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ, సునీల్, ధనుంజయ్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పాటలు, పోస్టర్ల ద్వారా సినిమాపై హైప్ పెంచారు. గత సోమవారం విడుదలైన ట్రైలర్, నిన్న బయటకొచ్చిన సమంత ఐటెం సాంగ్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com