హిందూపురంలో ఆందోళన.. బాలయ్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. జిల్లాల విభజన, వాటి పేర్ల విషయంలో జగన్ సర్కార్ తలనొప్పులు ఎదుర్కొంటోంటి. ఇప్పటికే కడప జిల్లాలో రాయచోటి కేంద్రంగా ఏర్పడనున్న అన్నమయ్య జిల్లాకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అటు కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రభుత్వం తెలిపింది. అయితే దీనికి వంగవీటి రంగా పేరు పెట్టి.. మచిలీపట్నం కేంద్రంగా వున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలంటూ డిమాండ్లు వస్తున్నాయి.
అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్‌లు స్థానికులకు మద్ధతుగా స్పందించడం లేదు. దీంతో జనం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రజా ప్రతినిధిలు కనబడటం లేదని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థానిక వన్‌టౌన్ పోలీసు సేష్టన్ లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ లు కనబడటం లేదని కంప్లయింట్ ఇచ్చారు. ఇప్పటికైనా వారంతా బయటికి వచ్చి, వెంటనే పదవులకు రాజీనామా చేసి.. హిందూపురం జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments