'డర్టీ హరి' నిర్మాతపై కేసు నమోదు
Send us your feedback to audioarticles@vaarta.com
క్లాసిక్ హిట్స్ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన నిర్మాత ఎంఎస్ రాజు, లాంగ్ గ్యాప్ తరువాత యూత్‌ను టార్గెట్ చేస్తూ ఓ బోల్డ్ అడల్ట్ కంటెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి ‘డర్టీ హరి’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఫిక్స్ చేసింది. అయితే ఈ సినిమా ఇప్పుడు వివాదంలో పడింది. మహిళలను, కించపరిచేలా, యూత్‌ను తప్పుదోవ పట్టించేలా ఉందని జూబ్లీ హిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం చిన్న సినిమా అంటే బూతు సినిమా అన్న స్థాయికి వచ్చేసింది. ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి బోల్డ్ కంటెంటే కరెక్ట్ అని దర్శక నిర్మాతలు ఫిక్స్ అవుతున్నారు. సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ రావాలంటే హాట్ సీన్లే కరెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే రొమాంటిక్ ఫోజులు, లిప్ లాప్ ఫోటోలనే పబ్లిసిటీలో ప్రధానంగా వాడుతున్నారు.. తాజాగా కొన్ని సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేస్తుండటంతో ఆయా సినిమాలకు సెన్సార్ ఇబ్బందులు కూడా లేవు. దీంతో ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తూ యూత్‌ను పక్కదోవ పట్టిస్తున్నారు.
కాగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి వెంకటగిరి వరకు ఉన్న మెట్రో పిల్లర్లపై ఈ ‘డర్టీ హరి’ సినిమా పోస్టర్లను అంటించారు. దీంతో పోలీసులు సిరీస్‌గా పరిగణలోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. స్త్రీ గౌరవాన్ని అవమానించేలా... యువతను తప్పుదోవ పట్టించే రీతిలో ‘డర్టీ హరి’ సినిమా పోస్టర్లు ఉన్నాయని సినీ నిర్మాత శివరామకృష్ణతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments