'డర్టీ హరి' నిర్మాతపై కేసు నమోదు

  • IndiaGlitz, [Monday,December 14 2020]

క్లాసిక్‌ హిట్స్ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన నిర్మాత ఎంఎస్‌ రాజు, లాంగ్ గ్యాప్ తరువాత యూత్‌ను టార్గెట్ చేస్తూ ఓ బోల్డ్ అడల్ట్ కంటెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి ‘డర్టీ హరి’ అనే టైటిల్‌‌ను చిత్రబృందం ఫిక్స్ చేసింది. అయితే ఈ సినిమా ఇప్పుడు వివాదంలో పడింది. మహిళలను, కించపరిచేలా, యూత్‌ను తప్పుదోవ పట్టించేలా ఉందని జూబ్లీ హిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం చిన్న సినిమా అంటే బూతు సినిమా అన్న స్థాయికి వచ్చేసింది. ఆడియన్స్‌‌ను ఆకట్టుకోవడానికి బోల్డ్ కంటెంటే కరెక్ట్‌ అని దర్శక నిర్మాతలు ఫిక్స్ అవుతున్నారు. సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ రావాలంటే హాట్ సీన్లే కరెక్ట్‌ అన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే రొమాంటిక్‌ ఫోజులు, లిప్‌ లాప్‌ ఫోటోలనే పబ్లిసిటీలో ప్రధానంగా వాడుతున్నారు.. తాజాగా కొన్ని సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేస్తుండటంతో ఆయా సినిమాలకు సెన్సార్ ఇబ్బందులు కూడా లేవు. దీంతో ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తూ యూత్‌ను పక్కదోవ పట్టిస్తున్నారు.

కాగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి వెంకటగిరి వరకు ఉన్న మెట్రో పిల్లర్లపై ఈ ‘డర్టీ హరి’ సినిమా పోస్టర్లను అంటించారు. దీంతో పోలీసులు సిరీస్‌గా పరిగణలోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. స్త్రీ గౌరవాన్ని అవమానించేలా... యువతను తప్పుదోవ పట్టించే రీతిలో ‘డర్టీ హరి’ సినిమా పోస్టర్లు ఉన్నాయని సినీ నిర్మాత శివరామకృష్ణతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

More News

బండారు దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు  పెను ప్రమాదం త్రుటిలో తప్పింది.

రానా బర్త్‌డే స్పెషల్.. ‘విరాటపర్వం’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది..

కెరీర్ ఆరంభం నుంచి స్లో అండ్ స్టడీ విధానాన్ని అవలంభిస్తూ.. మంచి మంచి పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా దగ్గుబాటి.

గ్రేటర్ ఫలితాల తర్వాత టీఆర్ఎస్ కు మరో భారీ షాక్..

గ్రేటర్ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి.

‘బిగ్‌బాస్ విన్నర్ అభి.. రన్నర్‌గా సొహైల్..’

కొన్ని వారాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ షో ముగింపు దశకు వచ్చేసింది. బిగ్‌బాస్ సీజన్ 3కి మాదిరిగానే..

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్...

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా ఒక్క పోస్టు కూడా తీయని తెలంగాణ ప్రభుత్వం సడెన్‌గా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది.