ఆలియాపై కేసు నమోదు...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆలియా భట్ 'గంగూబాయ్ కతియావాడి' అనే సినిమాలో నటిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆలియా టైటిల్ రోల్‌ను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ, జయంతిలాల్ గడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముంబై కామతిపూరను శాసించిన లేడీ డాన్‌గా గంగూబాయ్కు పేరుంది. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు.
కాగా.. ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేయాలని గంగూబాయ్ కుమారుడు బాబూజీ రాజీ షా కోర్టులో కేసు వేశాడు. దర్శక నిర్మాతలతో పాటు, ఆలియా భట్‌పై కూడా కేసు నమోదైంది. వీరితో పాటు మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే నవలను రాసిన రచయిత హుస్సేన్ జైదీ పేరు కూడా బాబూజీ ఫిర్యాదులో చేర్చాడు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ఉందని కాబట్టి మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తక ప్రచురణతో పాటు గంగూబాయ్ కతియావాడి సినిమాను ఆపాలని కేసును వేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments