కొంపముంచిన ప్రమోషన్ వీడియో... చిక్కుల్లో బిగ్‌బాస్ ‘‘సరయూ’’
Send us your feedback to audioarticles@vaarta.com
యూట్యూబ్ స్టార్ 7ఆర్ట్స్ సరయు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన బోల్డ్నెస్, హాట్ కామెంట్స్‌తో నెట్టింట రచ్చ చేసే సరయు బిగ్‌బాస్ సీజన్-5లో కంటెస్టెంట్‌గా ఎంపికై.. ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే సరయూ ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో ఓ మతాన్ని కించపరిచేలా అభ్యంతరకర విజువల్స్ ఉన్నాయంటూ ఈ బోల్డ్ బ్యూటీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే.. సరయూ, ఆమె బృందం ‘7 ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ‘7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్’ కోసం ఓ షార్ట్‌ఫిల్మ్ రూపొందించిన సరయూ బృందం గతేడాది ఫిబ్రవరి 25న తన ఛానల్‌తో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో సరయూ, ఆమె బృందం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించారు. సదరు వీడియో హిందువులను, మహిళలను కించపరిచే విధంగా ఉండటంతో సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సిరిసిల్ల పోలీసులు.. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ పరిధిలోని ఫిలింనగర్లో వీడియో షూట్ చేసినట్లు గుర్తించారు. దీంతో సిరిసిల్ల పోలీసులు కేసును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు.
కాగా.. బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్లో టాప్ 5లో ఖచ్చితంగా వుంటారని అనుకున్న వారిలో సరయూ ఒకరు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా తొలి వారానికే ఇంటి ముఖం పట్టి ఫ్యాన్స్‌ని నిరాశ పరిచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments