KTR:మంత్రి కేటీఆర్‌పై కేసు.. న్యాయపోరాటానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ హెచ్చరిక
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. వాడివేడి విమర్శలతో నేతలు ప్రచారంలో వేడి పుట్టిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఫాక్స్‌కాన్ కంపెనీ పెట్టిన యాపిల్ ఉత్పత్తుల పరిశ్రమను బెంగళూరుకు తరలించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖ రాసినట్లు మంత్రి కేటీఆర్ ఓ సభలో ఆరోపించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ వస్తే హైదరాబాద్‌లో ఉన్న పరిశ్రమలను బెంగళూరుకు తరలిస్తారనే ప్రచారం ప్రారంభించారు.
ఫేక్ లెటర్ అని డీకే క్లారిటీ..
ఈ ప్రచారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ధీటుగా స్పందించారు. తాను అలాంటి లేఖ ఫాక్స్‌కాన్ కంపెనీకి రాయలేదని స్పష్టంచేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు సర్క్యూలేట్ చేస్తున్న లేఖ ఫేక్ అని.. దీనిపై బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా స్పష్టంచేశారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ఎదురుదాడి ప్రారంభించారు. ఫేక్ ప్రచారంతో ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడుతున్నారు. "ఫేక్ లెటర్ తీసుకువచ్చి డికే శివకుమార్ గారు రాసారని ప్రెస్ మీట్లు పెట్టినవ్ సిగ్గుందా డ్రామారావు? " అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యాయపోరాటానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
డీకేని టార్గెట్ చేసిన బీఆర్ఎస్..
ట్రబుల్ షూటర్‌గా పేరు గడించిన డీకే శివకుమార్ తెలంగాణ ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తెర వెనుక వ్యూహాలు, పార్టీలో చేరికలు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయంటున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. దీంతో కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ నేతలు శివకుమార్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. కర్ణాటక కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని ఇక్కడ ఖర్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన రాసినట్లు ఓ ఫేక్ లెటర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. ఫేక్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్నారని మండిపడుతున్నారు. మీరు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ఈసారి అధికారంలోకి రావడం కష్టమని చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com