జయలలిత బయోపిక్స్ కు వ్యతిరేకంగా కేసు నమోదు
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు రాజకీయాల్లో మరచిపోలేని పేరు విప్లవ నాయకురాలు జయలలిత. ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె అనారోగ్యంతో దివంగతురాలయ్యారు. ఆమె మృతిపై పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను పక్కన పెడితే, ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ బాగానే నడుస్తుంది. ఈ క్రమంలో జయలలితపై మూడు బయోపిక్స్ రూపొందుతున్నాయి. అయితే ఈ బయోపిక్స్‌కు వ్యతిరేకంగా ఆమె మేనకోడలు దీప మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రాలు విడుదల కాకూడదని ఆమె కేసు వేశారు. అయితే ఆమె ఎందుకు కేసు వేశారనే దానిపై క్లారిటీ రాలేదు.
ప్రస్తుతం జయలలిత బయోపిక్స్‌లో రెండు బయోపిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో ఒకటి కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించబోతున్న తలైవి చిత్రమొకటి. ఎ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. కాగా మరో చిత్రం నిత్యామీనన్ టైటిల్ పాత్రలో నటిస్తున్నది. ప్రియదర్శిని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి `ది ఐరన్ లేడీ` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తలైవి మాత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఇది కాకుండా సీనియర్ దర్శకుడు భారతి రాజా ఓ సినిమాను తెరకెక్కించనున్నారని టాక్. కాగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments