బూతులు తిట్టాడని ఆహుతీ ప్రసాద్‌ కొడుకుపై కేసు

  • IndiaGlitz, [Thursday,June 06 2019]

టాలీవుడ్ సీనియర్ నటుడు ఆహుతీ ప్రసాద్ కుమారుడు కార్తీక్ ప్రసాద్‌పై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్కే సినిప్లెక్స్ పీవీఆర్‌లో ఈరోజు విడుదలైన ‘హిప్పీ’ సినిమాకు కార్తిక్ వెళ్లాడు. అయితే హాల్‌లో సినిమా మొదలయ్యే ముందు ‘జాతీయ గీతం’ వచిన్నపుడు అందరూ సీట్లలో నుంచి లేచి నిలబడగా.. కార్తీక్ మాత్రం నిలబడకుండా అలానే కూర్చొన్నాడు. దీంతో ఆయన పక్కనే ఉన్న వ్యక్తి శ్వేతా హర్ష.. జాతీయ గీతం వచిన్నపుడు ఎందుకు నిలబడలేదు..? అని కార్తీక్‌ను ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కార్తీక్.. మాటలకు చెప్పలేని బూతులు తిట్టాడని హర్ష చెబుతున్నాడు. దీంతో సినిమా హాల్ నుంచి నేరుగా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రహించిన హర్ష పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆహుతీ ప్రసాద్ 2015 జనవరి 04న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

More News

'జై సేన' చిత్రం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ భావాల‌కు సంబంధించింది - ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌

వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర

తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగవుతుందా..!?

తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు కానుందా..? టీడీపీకి పట్టిన గతే కాంగ్రెస్‌కు పట్టనుందా..? నేతలందరూ కాంగ్రెస్‌కు హ్యాండిచ్చేస్తారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా

ఆర్నెళ్లలోపే ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా జగన్ అడుగులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శరవేగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఐఏఎస్, ఐపీఎస్

పండుగలాంటి శుభవార్త చెప్పిన ఆర్బీఐ..

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆన్‌లైన్ లావాదేవీలపై పండుగలాంటి శుభవార్త అందించింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీలు ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ

సీఎం జగన్‌కు చంద్రబాబు రెక్వెస్ట్.. వైసీపీ నుంచి ఊహించని షాక్!

కృష్ణానది కరకట్ట పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్షనేతగా తనకు కేటాయించాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..