విశాఖలో నరమేధం.. ఆరుగురి దారుణ హత్య
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖలో ఒకే రోజు పది మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మధురవాడలో ఓ కుటుంబం సజీవ దహనమైతే.. పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. అంతా ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించి ఓ దుండగుడు ఆరుగురినీ దారుణంగా హతమార్చాడు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హతుల్లో రెండేళ్ల వయసున్న పసివాడు, ఆరు నెలల పసిపాప కూడా ఉండటం కలచివేస్తోంది. అయితే ఈ హత్యలు మొత్తం ఒక్కడి చేతి మీదుగానే జరగడం గమనార్హం. పిచ్చిపట్టినవాడిలా దొరికిన వారిని దొరికినట్టుగా ఎక్కడపడితే అక్కడ నరికేసి నరమేధం సృష్టించాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఆస్తి తగాదాలేనా?
ఆరుగురి హత్యకూ కారణం ఆస్తి తగాదాలేనని తెలుస్తోంది. ఆస్తి కోసం అప్పలరాజు అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు ఈ అప్పలరాజును రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు సమాచారం. ఈ దారుణ హత్యోదంతానికి రెండు కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం ఘర్షణలు జరుగుతున్నాయని బంధవులు చెబుతున్నారు. హంతకుడు అప్పలరాజును తమ ముందుకు తెచ్చేవరకూ మృతదేహాలను ఇక్కడ నుంచి కదలనివ్వమని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మృతులు బొమ్మిడి ఉషా(31), బొమ్మిడి రమాదేవి(45), బొమ్మిడి అరుణ (40), బొమ్మిడి రమణ (55) చిన్నారులు బొమ్మిడి ఉదయ్ (02), బొమ్మిడి ఆదిలక్ష్మి (6 నెలలు)గా పోలీసులు గుర్తించారు.
మరో కారణం వెలుగులోకి..
విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు ఘటనపై డీసీపీ సురేష్ బాబు, ఏసీపీ శ్రీపాదరావు ఆరా తీస్తున్నారు. అయితే ఈ హత్యలకు తాజాగా మరో కారణం కూడా వెలుగులోకి వచ్చింది. మృతుల కుటుంబానికి చెందిన విజయ్ అనే వ్యక్తి 2018లో అప్పలరాజు కూతురితో జరిపిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యలకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. తన కుమార్తెతో విజయ్ జరిపిన ఫోన్ ఛాటింగ్‌ను గుర్తించిన అప్పరాజు అతనిపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో పోలీసులు విజయ్ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి విజయ్‌పై అప్పలరాజు కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఇదే వ్యవహరంపై విజయ్ కుటుంబాన్ని అప్పలరాజు హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout