విశాఖలో నరమేధం.. ఆరుగురి దారుణ హత్య

  • IndiaGlitz, [Thursday,April 15 2021]

విశాఖలో ఒకే రోజు పది మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మధురవాడలో ఓ కుటుంబం సజీవ దహనమైతే.. పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. అంతా ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించి ఓ దుండగుడు ఆరుగురినీ దారుణంగా హతమార్చాడు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హతుల్లో రెండేళ్ల వయసున్న పసివాడు, ఆరు నెలల పసిపాప కూడా ఉండటం కలచివేస్తోంది. అయితే ఈ హత్యలు మొత్తం ఒక్కడి చేతి మీదుగానే జరగడం గమనార్హం. పిచ్చిపట్టినవాడిలా దొరికిన వారిని దొరికినట్టుగా ఎక్కడపడితే అక్కడ నరికేసి నరమేధం సృష్టించాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఆస్తి తగాదాలేనా?

ఆరుగురి హత్యకూ కారణం ఆస్తి తగాదాలేనని తెలుస్తోంది. ఆస్తి కోసం అప్పలరాజు అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు ఈ అప్పలరాజును రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు సమాచారం. ఈ దారుణ హత్యోదంతానికి రెండు కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం ఘర్షణలు జరుగుతున్నాయని బంధవులు చెబుతున్నారు. హంతకుడు అప్పలరాజును తమ ముందుకు తెచ్చేవరకూ మృతదేహాలను ఇక్కడ నుంచి కదలనివ్వమని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మృతులు బొమ్మిడి ఉషా(31), బొమ్మిడి రమాదేవి(45), బొమ్మిడి అరుణ (40), బొమ్మిడి రమణ (55) చిన్నారులు బొమ్మిడి ఉదయ్ (02), బొమ్మిడి ఆదిలక్ష్మి (6 నెలలు)గా పోలీసులు గుర్తించారు.

మరో కారణం వెలుగులోకి..

విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు ఘటనపై డీసీపీ సురేష్ బాబు, ఏసీపీ శ్రీపాదరావు ఆరా తీస్తున్నారు. అయితే ఈ హత్యలకు తాజాగా మరో కారణం కూడా వెలుగులోకి వచ్చింది. మృతుల కుటుంబానికి చెందిన విజయ్ అనే వ్యక్తి 2018లో అప్పలరాజు కూతురితో జరిపిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యలకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. తన కుమార్తెతో విజయ్ జరిపిన ఫోన్ ఛాటింగ్‌ను గుర్తించిన అప్పరాజు అతనిపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో పోలీసులు విజయ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి విజయ్‌పై అప్పలరాజు కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఇదే వ్యవహరంపై విజయ్ కుటుంబాన్ని అప్పలరాజు హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

More News

విశాఖలో ఎన్ఆర్ఐ కుటుంబం సజీవ దహనం..

ఫైనాన్షియల్‌గానే కాదు.. అన్ని విధాలుగా బాగుందనుకున్న ఎన్ఆర్ఐ కుటుంబం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది.

దిగ్గజ దర్శకుడి శంకర్‌కి షాక్..

దిగ్గజ దర్శకుడు శంకర్‌కి కాలం కలిసొస్తున్నట్టుగా లేదు. ఒక సినిమా మధ్యలోనే ఆగిపోతే.. మరో సినిమా పట్టాలెక్కకుండానే అటకెక్కేలా ఉంది.

ఏఎంబీ సినిమాస్‌కు అంతర్జాతీయ గుర్తింపు

సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాల్లో స్టార్ హీరోగా రాణిస్తూనే.. ఇటు వ్యాపారం రంగం వైపు కూడా అడుగులు వేస్తున్నారు

'నార‌ప్ప' చిత్రం నుండి ఫ్యామిలి పోస్ట‌ర్ విడుద‌ల‌

విక్టరి ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా,మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో

ఫస్ట్ ఈ ప్రాజెక్టులో నేను లేను: ‘మేజర్’ దర్శకుడు

‘గూఢచారి’గా ఎంతగానో ఆకట్టుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడవి శేష్.. ప్రస్తుతం ‘మేజర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.