"కేరాఫ్ సూర్య" టీం బంపర్ ఆఫర్
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ కిషన్, మెహ్రీన్ జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, జాతీయ అవార్డు గ్రహీత సుశీంద్రన్ దర్శకత్వంలో, శంకర్ చిగురు పాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ధియెట్రికల్ ట్రైలర్ మరియు సాంగ్స్ తో ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబర్ 10 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం కోసం హీరో సందీప్ కిషన్ చాలా వైవిధ్యంగా ప్రమెషన్స్ చేస్తున్నారు.
మామ్యూజిక్ ఛానల్ లో నవంబర్ 6 నుండి నవంబర్ 10 వరకు ఓక ఆఫ్ అన్ అవర్ యాంకర్ గా అవతారమెత్తి తన చిత్రాన్ని ఢిఫరెంట్ గా ప్రమెట్ చేస్తున్నాడు. అంతే కాకుండా పాపులర్ సీరియల్స్ తన ఎంట్రి ఇచ్చి తనదైన స్టైల్లో చిత్రాన్ని సామాన్య ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా తనవంతు కృషి తను చేస్తున్నాడు. ఇప్పటికే పాజిటివ్ బజ్ వున్న కేరాఫ్ సూర్య చిత్రం నవంబర్ 10న గ్రాండ్ గా విడుదలవుతుంది. ఇదిలా వుంటే ఓ ప్రముఖ ఛానల్ ద్వారా మెదటి మూడు రోజులు చూసిన ప్రేక్షకులకి ఐ10 కారు, 2 ఐఫోన్స్ మరియు పట్టుచీరలు బహుమతులుగా ఇవ్వబడుతుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య చిత్రం ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం సందీప్ కిషన్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. తనదైన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. మెహ్రీన్ కు చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్, లవ్ తో పాటు ఓ యూనిట్ పాయింట్ ను ఇందులో చెప్పబోతున్నాం. ఇమ్మాన్ మ్యూజిక్ మరో ఎస్సెట్ గా నిలవబోతోంది.
అయితే చిత్రం తీయటం ఎలావున్నా ఆ చిత్రానికి ధియోటర్ రప్పించటం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. మా హీరో సందీప్ కిషన్ తనవంతు గా ఢిఫెరెంట్ ప్రమెషన్ చేస్తూ ఇప్పటికే పాజిటివ్ బజ్ ని తీసుకువచ్చాడు. మా వంతుగా మెదటి మూడురోజులు చిత్రాన్ని చూసిన ప్రేక్షకుల్లో లక్కి డ్రా ద్వారా సెలక్ట్ చేసి ఐ10 కారు, ఐఫోన్స్ మరియు పట్టుచీరలు ఇవ్వటం జరుగుతుంది. ఈ చిత్రం తప్పకుండా అందర్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments