క్రమశిక్షణ - సమయపాలన విజయానికి సోపానాలు - కేరాఫ్ గోదావరి కధానాయకుడు రోహిత్
Wednesday, November 23, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పంక్చువాలిటీ, డిసిప్లిన్ ఓ పర్సన్ సక్సస్ లో కీ రోల్ ప్లే చేస్తాయని అన్నారు యువ కధానాయకుడు రోహిత్.ఎస్. 'కేరాఫ్ గోదావరి' చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న రోహిత్.. హైదరాబాద్, బంజారాహిల్స్ లో పేద పిల్లల కోసం నిర్వహిస్తున్న వివేకానంద పబ్లిక్ స్కూల్ విద్యార్థినీవిద్యార్థులకు డిజిటల్ వాచీలు మరియు చాకలేట్స్ పంచిపెట్టారు.
ఈ సందర్భంగా పిల్లలనుద్దేశించి రోహిత్ మాట్లాడుతూ .... ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ చాల కీలకమైనది. చదువుకునే వయసు నుంచే ప్రతి ఒక్కరు పంక్చువాలిటీ, డిసిప్లిన్ అలవర్చుకోవాలని అన్నారు. ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా విద్యనందిస్తూ.. ఉచిత మధ్యాహ్న భోజన పధకాన్ని సైతం అమలు చేస్తున్న వివేకానంద స్కూల్ యాజమాన్యాన్ని రోహిత్ అభినందించారు. వివేకానంద స్కూల్ స్టూడెంట్స్ అందరికీ "కేరాఫ్ గోదావరి" చిత్రాన్ని ఉచితంగా చూపిస్తానని లోహిత్ హామీ ఇచ్చారు.తమ విద్యార్థులందరికీ.. చిన్నప్పటి నుంచి టైం సెన్స్ ఏర్పడేందుకు దోహదపడేలా డిజిటల్ వాచీలు బహూకరించిన రోహిత్ కి స్కూల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. రోహిత్ వంటి దాతల సహాయసహకారాల వల్లే తమ స్కూల్ ను ఫీజులు తీసుకోకుండా నిర్వహించగలుగుతున్నామని వారు తెలిపారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "కేరాఫ్ గోదావరి" డిసెంబర్ ద్వితీయార్ధంలో విడుదలకు సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments