సీమ ముద్దుబిడ్డ జగన్ ఇవేం కనపడలేదా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో మూడ్రోజుల పర్యటన ముగిసింది. ఈ మూడ్రోజుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ఆఖరి ఆళ్ళగడ్డలో బహిరంగసభ పవన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్, టీడీపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇవేం కనపడలేదా..!?
"ఆళ్లగడ్డకు కూతవేటు దూరంలో శ్రీశైలం ప్రాజెక్టు ఉండికూడా నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో దాహార్తి ఉంది. కర్నూలు జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య కూడా ఉంది. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ ఎందుకు చట్టసభల్లో దీని గురించి మాట్లాడటం లేదు. వీళ్లకు అధికారమే అంతిమ లక్ష్యమే తప్ప ప్రజలకు న్యాయం జరగడం కాదు. వామపక్షాలతో కలిసి రాయలసీమలో మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాం. ఆశయాలతో వచ్చిన జయప్రకాశ్ నారాయణ, చిరంజీవి లాంటి వారిని నిలబడనివ్వలేదు. నేను చాలా మొండివాడిని.. పోతే ప్రాణాలు పోవాలి తప్ప ఆశయాలను పోనివ్వను" అని పవన్ తీవ్ర ఆగ్రహంతో చెప్పుకొచ్చారు.
పాలెగాళ్లు అంటే ఇలా ఉండాలి..
"పాలెగాళ్లు అంటే అన్యాయానికి అడ్డంగా నిలబడేవాళ్లు. కానీ ఇవాళ రాయలసీమలో 60:40 శాతం రాజకీయం నడుస్తోంది. నియోజకవర్గంలో ఏ పనులు చేపట్టాలన్న అధికారపక్షం 60 శాతం, ప్రతిపక్షం 40 శాతం వాటాలు తీసుకుంటున్నాయి. దీంతో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక ప్రజలు నష్టపోతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఈ మధ్య కాలంలో 269 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వంగానీ, ప్రతిపక్షం గానీ గుర్తించడం లేదు. మరి ఎవరు గుర్తిస్తారు. వాళ్ళకి రైతు మృత్యు ఘోష వినిపించదా? జనసేన పార్టీ గుర్తిస్తుంది. చనిపోయిన రైతు కుటుంబాల పక్షాన జనసేన పార్టీ పోరాటం చేస్తుంది"అని ఈ సందర్భంగా రైతన్నల కుటుంబాలకు పవన్ భరోసా ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments