ఆ ఆలోచనే నమ్మలేకున్నా: హరితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాలు, సీరియళ్ల కంటే బిగ్‌బాస్ సీజన్ 1 ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న నటి హరితేజ. ప్రస్తుతం ఆమె తల్లి కాబోతోంది. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరితేజ ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు వైద్యులు డెలివరి డేట్ ఏప్రిల్ 1 గా నిర్ధారించారని ఆమె వెల్లడించింది. తనకు తల్లి కాబోతున్నానని తెలిసిన క్షణాన తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని హరితేజ వెల్లడించింది. తన భర్త దీపక్ తనను హగ్ చేసుకుని ఆనందం వ్యక్తం చేశాడని హరితేజ గుర్తు చేసుకుంది. తనలో బేబి పెరుగుతోందన్న ఆలోచననే నమ్మలేకుండా ఉన్నానని హరితేజ వెల్లడించింది. త్వరలో తనొక పెద్ద రెస్పాన్సిబులిటీ తీసుకోబోతున్నానని అనిపించిందట.
మాతృత్వమనేది ఒక అందమైన విషయంగా హరితేజ అభివర్ణించింది. గతంలో కంటే ఇప్పుడు మరింతగా తన తల్లిని ప్రేమిస్తున్నానని ఆమె తెలిపింది. ఆమె తమ కోసం ఎంత కష్టపడింది.. ఎన్ని త్యాగాలు చేసిందనేది తను అర్థం చేసుకోగలిగానని వెల్లడించింది. ప్రస్తుతం అమ్మలు, మహిళల పట్ల గౌరవభావం మరింత పెరిగిందని హరితేజ వెల్లడించింది. మాతృత్వం అనేది తన ధృక్కోణాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపింది. మహిళల అందమనేది మాతృత్వంలోనే ఉందని తాను ఫీలవుతున్నానని వెల్లడించింది. తన బేబీ విషయంలో తాను చాలా సెన్సిటివ్‌గా.. మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని హరితేజ వెల్లడించింది.
ఇక తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి హరితేజ మాట్లాడుతూ.. ఇక మీదట సింపుల్‌గా ముందుకు వెళదామనుకుంటున్నానని.. జీవితాన్ని చాలా సెన్సిబుల్‌గా గడిపేయాలనుకుంటున్నానని వెల్లడించింది. ఇక మీదట కెరీర్ కోసం పరిగెత్తాలని తాను భావించడం లేదని తెలిపింది. ప్రస్తుతానికి తాను మాతృత్వాన్ని తద్వారా వచ్చే అందమైన క్షణాలను స్వీకరించాలనుకుంటున్నానని వెల్లడించింది. వివాహం గురించి హరితేజ మాట్లాడుతూ.. అదొక గొప్ప బాధ్యత అని దానిని ప్రేమతో స్వీకరించాలని తెలిపింది. జీవితాంతం ఒకరు మనకు తోడుంటారనే భావనే చాలా అందమైనదని వెల్లడించింది. తానేదో జీవితం అద్భుతంగా ఉండాలని ఊహించుకోలేదని.. రియాలిటీలో జీవించాలనుకున్నానని తెలిపింది. దీపక్‌ను జీవిత భాగస్వామిగా పొందడం ఒక అద్భుతమని హరితేజ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com