ఆర్టికల్ 370పై ‘సమాచారం’ ఇవ్వరేం!?
Send us your feedback to audioarticles@vaarta.com
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) గురించి భారతీయులకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ చట్టం ద్వారా దాదాపు ప్రభుత్వంలోని అన్ని విభాగాల నుంచి సమాచారం రాబట్టుకోవచ్చు. అంతేకాదు.. మీరు అడిగిన సమాచారానికి కచ్చితంగా సదరు ఆఫీసర్ రియాక్ట్ అయ్యి తీరాల్సిందే.. లేనిచో తదుపరి పరిణామాలు వేరేగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టీఐ అనేది సామాన్యుడికి ఒక అస్త్రం లాంటిదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ఆర్టీఐ ద్వారా ఇప్పటికే ఎన్నో కుంభకోణాలు, ఆసక్తికర, సంచలన విషయాలు వెలుగుచూశాయి. అయితే తాజాగా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఆర్టికల్ 370 కి సంబంధించిన వ్యవహారంపై వివరాలు ఇచ్చేందుకు గాను కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిరాకరించింది.
అసలేం జరిగింది..!
కాగా.. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి సంబంధించిన విషయం అనేది తెలిసిందే. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ప్రభుత్వ ఫైల్ కావాలంటూ లక్నోకు చెందిన హక్కుల కార్యకర్త నూతన్ ఠాకూర్ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన అడిగిన వివరాలను ఇచ్చేందుకు కుదరదని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) నిరాకరించింది. వాస్తవానికి రక్షణశాఖ, కొన్ని గోప్యంగా ఉంచాల్సిన వ్యవహారాలను ఆర్టీఐ ద్వారా కూడా తెలియజేయడానికి సదరు సంస్థలు అంగీకరించవు.. ఇది ఆర్టీఐ యాక్ట్‌లో ఉంటుంది. అందుకే ఇలా సమాచారం ఇవ్వడానికి కేంద్రంలోని హోం శాఖ నిరాకరించి ఉండొచ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కాగా.. ఆర్టీఏ చట్టం సెక్షన్ 8(1) ప్రకారం ఓ పౌరుడికి ఇటువంటి సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని సీపీఐవో తేల్చి చెప్పింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments