Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్న అభ్యర్థులే ఎక్కువ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. పోలింగ్‌కు వారం రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి 360 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 226 మంది నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్‌లను పరిశీలించి నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల డేటాను విడుదల చేసింది. 48 శాతం మంది అభ్యర్థులు నేరచరిత్ర ఉన్న వారేనని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 84 మంది అభ్యర్థులపై 540 కేసులు.. బీజేపీకి చెందిన 78 మంది అభ్యర్థులపై 549 కేసులు.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులపై 120 కేసులు.. ఎంఐఎం అభ్యర్థులపై 11 కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
బీఆర్ఎస్ అభ్యర్థుల్లో సీఎం కేసీఆర్ పై 9 కేసులు ఉన్నాయి. ఇక అత్యధికంగతా కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పై 10 కేసులు, కేటీఆర్‌పై 8, సబితా ఇంద్రారెడ్డిపై 5, సైదిరెడ్డిపై 5 కేసులు నమోదయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు, ఖానాపూర్ అభ్యర్థి బుజ్జిపై 52, ప్రేమ్ సాగర్ రావుపై 32, పి శ్రీనివాస్ పై 24, జయప్రకాశ్ రెడ్డిపై 20 కేసులు, జగ్గారెడ్డిపై 20 కేసులు ఉన్నాయి.
బీజేపీ నేతల్లో గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ పై అత్యధికంగా 89 కేసులు ఉండగా.. కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌పై 59, బోధ్ అభ్యర్థి సోయం బాపూరావుపై 55 కేసులు, ఈటల రాజేందర్ పై 40, రఘునందన్ పై 27, ధర్మపురి అర్వింద్ పై 17, మేడిపల్లి సత్యంపై 18 కేసులు ఉన్నట్లు తేలింది. ఇక మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీపై 6 కేసులున్నాయి.
అయితే ఎక్కువ మంది అభ్యర్థులపై తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసులే ఉన్నాయి. కానీ నేరచరితులకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వవద్దని చెబుతున్నా ప్రధాన పార్టీలు టికెట్లను వారికే కేటాయిన్నాయి. దీంతో అలాంటి నేతలు చట్టసభల్లో ఉండటం వల్ల రౌడీరాజ్యం పెరిగిపోతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com