ఆ తల్లి ఆవేదనకు కన్నీళ్లు పెడుతున్న నెటిజన్లు
Send us your feedback to audioarticles@vaarta.com
పిల్లలు ఎటు వెళ్లొచ్చినా.. ఇంటికి రాగానే అమ్మ కోసమే వెదుక్కుంటారు. పెద్దవాళ్లైన తర్వాత కూడా దీనిలో మార్పైతే ఏమీ ఉండదు. పిల్లలు ఎంత పెద్దవారైనా సరే.. అమ్మ కంటికి మాత్రం ఎప్పుడూ చిన్నారుల్లాగే కనిపిస్తారు. దేశాలు మారొచ్చు.. సంస్కృతులు మారొచ్చు.. అమ్మ ప్రేమ మాత్రం మారదు. తాజాగా ఓ తల్లి వేదన ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తోంది. తాను మరణపు అంచున ఉన్నానని ఈ విషయాన్ని తన చిన్నారి కొడుక్కి అర్థమ్యేలా ఎలా చెప్పాలని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అమ్మ ఆవేదనకు నెటిజన్లు కన్నీళ్లు పెడుతుంటడం గమనార్హం.
కెనడాకు చెందిన న్యూరో సైంటిస్ట్ చౌదరి నాడియా అనే మహిళ అండాశయ క్యాన్సర్తో పోరాడుతోంది. నేను త్వరలో క్యాన్సర్తో మరణిస్తానంటూ నాడియా చేసిన హృదయ విదారక ట్వీట్.. నెటిజన్లతో కన్నీళ్లు పెట్టిస్తోంది. కాగా డాక్టర్ చౌదరి గత సంవత్సరం అన్యారోగ్యంగా ఉండటంతో జూన్ 2020న పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆమెకు అండాశయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ విషయాలను బుధవారం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘‘ఇక నేను ఎంతో కాలం జీవించను. ఈ రోజు ఆ విషయాన్ని నా కొడుక్కి చెప్పబోతున్నాను. ఇప్పుడు తనకు ఈ విషయం చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది. ఈ మధ్యాహ్నం వరకూ నా కన్నీటిని పూర్తిగా బయటకు పంపించేసి తనకు విషయం చెప్పగలిగే ధైర్యం తెచ్చుంకుంటాను. అది నా కొడుకుని ఓదర్చడానికి సహాయపడుతుంది’’ అని ఆమె ట్వీట్ చేశారు. అలాగే తన కొడుకుతో ఉన్న ఫోటోను నాడియా పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు తమ కామెంట్లతో ఆమెకు ధైర్యం చెప్పేందుకు యత్నిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి తల్లీ మీకు మనోధైర్యాన్ని, బలాన్ని అందించాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com