Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు చేయండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం..

  • IndiaGlitz, [Wednesday,January 24 2024]

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాంటూ పిటిషన్ వేసింది. ఈనెల 29న విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు లిక్కర్, ఇసుక కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

సీఐడీ తనపై నమోదైన చేసిన ఇన్నర్ రింగ్, మద్యం, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై సుదీర్ఘంగా విచారణ జరగ్గా.. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. కాగా స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్టు చేశారు. అనంతరం సెప్టెంబర్ 10న విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు.

సెప్టెంబర్ 10 నుంచి 52 రోజులు పాటు ఆయన జైలులోనే ఉన్నారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా హైకోర్టు ఆయనకు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. అనంతరం దానిని పూర్తి స్థాయి బెయిల్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే క్రమంలో ఆయనపై సీఐడీ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక అక్రమాలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

ఇటీవల చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. చంద్రబాబుకు అనుకూలంగా 17ఏ సెక్షన్ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు ఇవ్వగా.. 17ఏ వర్తించదని జస్టిస్ త్రివేది తెలియజేశారు. దీంతో తమకు దీనిపై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని.. దీంతో తుది నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు నివేదిస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవితవ్యం సీజేఐ చేతుల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

More News

జనసేనలోకి మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఎంపీ.. ముహుర్తం ఖరారు..

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి.

సీఎం రేవంత్‎ రెడ్డితో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకే సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశామని

తండ్రి దశాబ్దాల కల నెరవేర్చిన పార్టీకి వెన్నుపోటు.. దేవరాయులు తీరుపై ఆగ్రహం..

నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేసిన విధానం చూస్తే టీడీపీతో కలిసే ప్రణాళికలో భాగమే అని తెలిసిపోతుంది.

ఏప్రిల్‌ నెలలోనే ఏపీ ఎన్నికలు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు..

ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తిగా ఎన్నికల వాతావరణమే కనపడుతోంది. అన్ని పార్టీలు రణరంగంలో దూకేందుకు పూర్తిగా రెడీ అయ్యాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం

టీడీపీకి ఊహించని షాక్.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం..

ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదించారు.