గురువు ఇవ్వలేనిది..శిష్యుడు ఇవ్వగలడా?

  • IndiaGlitz, [Friday,October 16 2015]

కొందరు ఫ‌లితాల కంటే ప్ర‌తిభ‌కే ప‌ట్టం క‌డ‌తారు. అలాంటి వారిలో నంద‌మూరి వారి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్ రామ్ ఒక‌రు. ఈ ఏడాది ఆరంభంలో 'ప‌టాస్‌'తో హిట్ కొట్టిన కళ్యాణ్‌.. ఈ నెలాఖ‌రులో 'షేర్‌'గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. మ‌ల్లికార్జున్ ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు. క‌ళ్యాణ్‌, మ‌ల్లిల సినీ ప్ర‌యాణం అటు ఇటుగా ఒకే టైంలో మొద‌లైంది.

క‌ళ్యాణ్ రామ్ రెండో చిత్రం 'అభిమ‌న్యు'తో పాటు 2010లో వ‌చ్చిన 'క‌త్తి' సినిమాకీ మ‌ల్లినే ద‌ర్శ‌కుడు. ఈ రెండు చిత్రాలూ ఆశించిన విజ‌యాన్ని అందించలేక‌పోయాయి. మూడోసారైనా వీరి కాంబినేష‌న్ మ్యాజిక్ చేస్తుందేమో చూడాలంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. విశేష‌మేమిటంటే.. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన గ‌త రెండు చిత్రాల‌కూ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తే.. తాజా చిత్రానికి ఆయ‌న శిష్యుడు త‌మ‌న్ బాణీలందించారు. మ‌రి గురువు ఇవ్వ‌లేని స‌క్సెస్‌.. శిష్యుడు ఇవ్వ‌గ‌ల‌డా? వేచి చూద్దాం.